Site icon NTV Telugu

Mohanlal : రెండు సార్లు వాయిదా.. ముచ్చటగా మూడోసారి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న వృషభ

Vrusshabha

Vrusshabha

మోహన్ లాల్ అప్ కమింగ్ ఫిల్మ్ వృషభ అనుకున్నట్లే వాయిదా పడింది. రూ. 70 కోట్లతో తెరకెక్కిన ఈ బైలింగ్వల్ ఫిల్మ్ తొలుత అక్టోబర్ 18న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. అందుకు సంబంధించి అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. కానీ అనుకోని కారణాలతో నవంబర్ 6కి పోస్ట్ పోన్ చేస్తున్నారు ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా టీమ్ నుండి ఎలాంటి హడావుడి చేయకపోవడంతో సినిమా వాయిదా పడుతుందన్న వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ రీసెంట్‌గా మరోసారి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రకటించారు యూనిట్.

Also Read : Bollywood : రూట్ మార్చిన బాలీవుడ్.. వార్ సినిమాలపైనే ఫోకస్.. కారణం ఏంటి?

ఇప్పుడు లేటెస్ట్ గా మరోడేట్ ను ఫిక్స్ చేసారు.  ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న వృషభ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. టాలీవుడ్ లో ఈ క్రిస్మస్‌కు పోటీ రాను రానూ పెరిగిపోతోంది. టాలీవుడ్ లో డిసెంబర్ నుండి డెకాయిట్ తప్పుకోగానే, రేసులోకి దూసుకొచ్చాయి రోషన్ ఛాంపియన్, ఆది సాయి కుమార్ శంభాల సినిమాలు. వీటితో పాటు గుణశేఖర్ యుఫోరియా కూడా అదే డేటుకు రాబోతోంది. తాజాగా  అడివి శేష్ తప్పుకున్న డేట్ కు వృషభ  కర్చీఫ్ వేసింది. అయితే ఈ సినిమా ఇన్నిసార్లు వాయిదా పాడడానికి వీఎఫ్ఎక్స్ కారణం అని సమాచారం. మోహన్ లాల్‌కు భారీ ప్రాజెక్ట్ చిత్రాలు అస్సలు కలిసి రావడం లేదు. ఎంపురన్ మినహాయిస్తే, వంద కోట్లతో తీసిన మరక్కార్, మలికోట్టై వాలిబన్, లాస్ట్ ఇయర్ దర్శకత్వం చేపట్టిన బర్రోజ్ కూడా డిజాస్టర్ అయ్యాయి. నందకిశోర్ దర్శకత్వంలో రూ. 70 కోట్లతో తెరకెక్కిన వృషభ భారీ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

Exit mobile version