NTV Telugu Site icon

Voyager: భూమి నుంచి 20 బిలియన్ కి.మీ దూరంలో వయోజర్.. నాసా కీలక నిర్ణయం..

Voyager 1

Voyager 1

Voyager: వయోజర్ 1, వయోజన్ 2.. ఈ రెండు స్పేస్ ప్రోబ్స్ ఇప్పటి వరకు మానవుడి ద్వారా నిర్మించబడి విశ్వంలో అత్యంత దూరం ప్రయాణించిన అంతరిక్ష వస్తువులుగా రికార్డు సృష్టించాయి. సౌర వ్యవస్థను ఎప్పుడో దాటవేసిన ఇవి, ప్రస్తుతం ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లో ప్రయాణిస్తున్నాయి. సూర్యుడి రక్షణ బుడగను, ఆవల ఉన్న అంతరిక్ష ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్నాయి. అయితే, వయోజర్ ప్రోబ్స్‌లో రెండు పరికరాలను నాసా నిలిపేయనుంది. దీని ద్వారా వాటిలో ఉన్న విద్యుత్‌ని ఆదా చేయాలని చూస్తోంది.

Read Also: CM Chandrababu: కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో చంద్రబాబు భేటీ..

ఈ చర్యల ద్వారా, అత్యంత సుదూర ప్రాంతంలోని అంతరిక్ష అధ్యయనం, వాటి తీరును తెలుసుకోవడంలో మరింత సహయపడుతుంది. వయోజర్ 2లోని చార్జ్డ్ పార్టికల్స్, కాస్మిక్ కిరణాలను కొలిచే పరికరం ఈ నెలాఖరులో ఆపేస్తామని నాసా బుధవారం తెలిపింది. గత వారం నాసా వయోజర్ 1లోని కాస్మిక్ కిరణాల అధ్యయనం చేసే పరికరాన్ని నిలిపేసింది. వయోజర్ 2 లో-ఎనర్జీ చార్జ్డ్ పార్టికల్స్ పరికరం, మన సౌర వ్యవస్థ, గెలాక్సీ నుంచి ఉద్భవించే అయాన్లు, ఎలక్ట్రాన్లు, కాస్మిక్ కిరణాలను కొలుస్తుంది. ఈ నెలఖారులో దీనిని డీయాక్టివేట్ చేయనున్నారు.

మిషన్ కాలాన్ని పెంచేందుకు ఇంధన పొదుపు చాలా అవసరమని నాసా భావిస్తోంది. 1977లో ఈ రెండింటిని నాసా ప్రయోగించింది. వయోజర్ 1 గురుడు, శని, వీటి చంద్రుల చుట్టూ ఉన్న సన్నని వలయాలను కనుగొంది. వయోజర్ 2 యూరేనస్, నెప్ట్యూన్‌లను సమీపించిన ఏకైక అంతరిక్ష నౌకగా ఉంది. ప్రస్తుతం సూర్యుడి రక్షణ బుడగను, దాని అవతల అంతరిక్ష వాతావరణాన్ని స్టడీ చేసేందుకు, రెండింటిలో మూడేసి పరికాలు ఉన్నాయి. ప్రస్తుతం వాయేజర్ 1 భూమి నుండి 24.14 బిలియన్ కిలోమీటర్ల దూరంలో,వాయేజర్ 2 20.92 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది.