Voyager: భూమి నుంచి 20 బిలియన్ కి.మీ దూరంలో వయోజర్.. నాసా కీలక నిర్ణయం..
- 20 బిలియన్ కి.మీ ఆవల వయోజర్ ప్రోబ్స్..
- కీలక పరికరాలను డీయాక్టివేట్ చేయనున్న నాసా..
- మిషన్ కాలాన్ని పెంచేందుకు చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Voyager: వయోజర్ 1, వయోజన్ 2.. ఈ రెండు స్పేస్ ప్రోబ్స్ ఇప్పటి వరకు మానవుడి ద్వారా నిర్మించబడి విశ్వంలో అత్యంత దూరం ప్రయాణించిన అంతరిక్ష వస్తువులుగా రికార్డు సృష్టించాయి. సౌర వ్యవస్థను ఎప్పుడో దాటవేసిన ఇవి, ప్రస్తుతం ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లో ప్రయాణిస్తున్నాయి. సూర్యుడి రక్షణ బుడగను, ఆవల ఉన్న అంతరిక్ష ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్నాయి. అయితే, వయోజర్ ప్రోబ్స్లో రెండు పరికరాలను నాసా నిలిపేయనుంది. దీని ద్వారా వాటిలో ఉన్న విద్యుత్‌ని ఆదా చేయాలని చూస్తోంది.
Read Also: CM Chandrababu: కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో చంద్రబాబు భేటీ..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ చర్యల ద్వారా, అత్యంత సుదూర ప్రాంతంలోని అంతరిక్ష అధ్యయనం, వాటి తీరును తెలుసుకోవడంలో మరింత సహయపడుతుంది. వయోజర్ 2లోని చార్జ్డ్ పార్టికల్స్, కాస్మిక్ కిరణాలను కొలిచే పరికరం ఈ నెలాఖరులో ఆపేస్తామని నాసా బుధవారం తెలిపింది. గత వారం నాసా వయోజర్ 1లోని కాస్మిక్ కిరణాల అధ్యయనం చేసే పరికరాన్ని నిలిపేసింది. వయోజర్ 2 లో-ఎనర్జీ చార్జ్డ్ పార్టికల్స్ పరికరం, మన సౌర వ్యవస్థ, గెలాక్సీ నుంచి ఉద్భవించే అయాన్లు, ఎలక్ట్రాన్లు, కాస్మిక్ కిరణాలను కొలుస్తుంది. ఈ నెలఖారులో దీనిని డీయాక్టివేట్ చేయనున్నారు.
మిషన్ కాలాన్ని పెంచేందుకు ఇంధన పొదుపు చాలా అవసరమని నాసా భావిస్తోంది. 1977లో ఈ రెండింటిని నాసా ప్రయోగించింది. వయోజర్ 1 గురుడు, శని, వీటి చంద్రుల చుట్టూ ఉన్న సన్నని వలయాలను కనుగొంది. వయోజర్ 2 యూరేనస్, నెప్ట్యూన్లను సమీపించిన ఏకైక అంతరిక్ష నౌకగా ఉంది. ప్రస్తుతం సూర్యుడి రక్షణ బుడగను, దాని అవతల అంతరిక్ష వాతావరణాన్ని స్టడీ చేసేందుకు, రెండింటిలో మూడేసి పరికాలు ఉన్నాయి. ప్రస్తుతం వాయేజర్ 1 భూమి నుండి 24.14 బిలియన్ కిలోమీటర్ల దూరంలో,వాయేజర్ 2 20.92 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..