NTV Telugu Site icon

Prakasam Tension: దర్శి పోలింగ్ కేంద్రంలో ఓటర్ల మధ్య వివాదం.. కింద పడిపోయిన ఈవీఎం!

Darshi

Darshi

AP Elections 2024: ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని బొట్లపాలెంలో పోలింగ్ పునః ప్రారంభమైంది. అయితే, పోలింగ్ కేంద్రంలో ఓటర్ల మధ్య వివాదంతో తోపులాట స్టార్ట్ అయింది. దీంతో ఈవీఎం మిషన్లు కింద పడిపోయాయి. ఇక, పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటింగ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘర్షణకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా, విషయం తెలుసుకుని పోలింగ్ కేంద్రం దగ్గరకు దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి చేరుకున్నారు.

Read Also: Lok Sabha Elections 2024 : తెలంగాణలో ఉదయం 11 గంటల వరకు 24.31 శాతం పోలింగ్‌

అయితే, తమ ఏజెంట్లను వైసీపీ ఏజెంట్లు బయటకు వెళ్ళమని చెప్పడంతోనే ఘర్షణకు దిగారని టీడీపీ ఎమ్మె్ల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ ఆరోపించారు. దీంతో కాసేపు ఎన్నికల అధికారులు పోలింగ్ నిలిపి వేశారు. దీనికి నిరసనగా టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి రోడ్డుపై బైఠాయించారు. అలాగే, విషయం పెద్దది కావడంతో రెండు వైపులా ఇరు పార్టీలకు చెందిన నేతలు మోహరించారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం యధావిధిగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది.