Site icon NTV Telugu

Union Budget: మధ్యంతర బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడతారు!?

New Parliment

New Parliment

ప్రస్తుతం పార్లమెంట్ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఎన్నికల ముందు జరుగుతున్న ఇవే చివరి సమావేశాలు. గురువారమే ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌పై అన్ని వర్గాల వారు చాలా ఆశలు పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి కచ్చితంగా ఊరట కలిగించే ప్రకటనలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇంకోవైపు ముచ్చటగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. ఇదంతా ఒకెత్తు అయితే అసలు మధ్యంతర బడ్జెట్‌ను ఎందుకు ప్రవేశపెడతారు. పూర్తి బడ్జెట్‌ను ఎందుకు ప్రవేశపెట్టకూడదో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ఫిబ్రవరి 1, 2024న నిర్మలా సీతారామన్ 2024-25 మధ్యంత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది కేవలం తాత్కాలిక బడ్జెట్ మాత్రమే. ఎందుకంటే త్వరలోనే దేశ వ్యాప్తంగా సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అవకాశం ఉండదు. ఈ సంప్రదాయం ఎప్పుటి నుంచో కొనసాగుతోంది. ప్రస్తుతం అదే సాంప్రదాయాన్ని మోడీ సర్కార్ కూడా పాటిస్తోంది. ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకూ ఉపయోగపడుతుంది. ఆయా పథకాలకు, జీతాలకు, తదితర వాటి కోసం డబ్బు అవసరం ఉంటుంది. అందుకోసమే నూతన ప్రభుత్వం ఏర్పడే వరకూ కొంత ధనాన్ని ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి మనీ అవసరం ఉంటుంది. అందుకోసమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంటారు.

ఇది కూడా చదవండి:Breaking: ఇకపై నంది అవార్డుల స్థానంలో గద్దర్‌ అవార్డులు

ఇక త్వరలోనే దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రక్రియ అంతా పూర్తైంత వరకూ మే నెల పడుతుంది. అంటే జూన్‌లోనే నూతన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ కొత్త ప్రభుత్వం 2024-25కు సంబంధించిన తుది బడ్జెట్‌ను జూలైలో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అప్పటి వరకూ ఖర్చు చేసేందుకు మాత్రం ఇప్పుడు ప్రవేశపెడుతున్న ఓటాన్ అకౌంట్ బడ్జెన్‌ను ఉపయోగిస్తుంటారు.

Exit mobile version