NTV Telugu Site icon

Vote Casting: భాద్యత అంటే ఇదికదా.. చేతులు లేకపోయినా ఓటేసిన వ్యక్తి.. వీడియో వైరల్..

Vote

Vote

ఎన్నికల్లో ఓటు వేయడానికి చాలా మందికి బద్ధకం అని చెప్పవచ్చు. కొంతమంది పని చేసే కంపెనీలు సెలవులు ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నారు. కానీ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయరు. అయితే, ఒక వ్యక్తి తనకు చేతులు లేకపోయినా తన కాళ్లతో ఓటు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Also read: Rythu Bharosa: ఈసీ దెబ్బకు ‘రైతు భరోసా’ నిధులు ఆలస్యం.. మే 13 తర్వాతే..

మంగళవారం గుజరాత్‌లో జరుగుతున్న మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో అంకిత్ సోనీ అనే వ్యక్తి చేతులు, కాళ్లు లేకపోయినా ఓటు వేశారు. గుజరాత్‌లోని నాడియాడ్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకొవాలని అంకిత్ కోరారు. శ‌రీరంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా కానీ., ఓటు వేసేందుకు బద్దకించేవాళ్ల చెంపమీద కొట్టినట్టుగా రాజ్యాంగం తనకు కల్పించిన హక్కును అంకిత్ సోనీ వినియోగించుకున్నాడు. చిత్తశుద్ధి ఉండాలేగానీ దేనికీ అవిటితనం అడ్డుకాదని అత‌డు నిరూపించాడు.

Also read: Stock Market: ఆ దెబ్బతో భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్..

20 ఏళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయినట్లు అంకిత్ సోనీ తెలిపారు. అయితే, గత 20 ఏళ్లలో తాను ఓటింగ్‌కు దూరంగా ఉండలేదన్నారు. చేతులు లేకపోయినా కాలి వేళ్లతో ఓటేస్తానన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అంకిత్ తన కాళ్లతో ఓటు వేసిన వీడియో వైరల్ అవుతుంది. ఓటు వేసేందు బధ్ధగించే వాళ్లకి ఉన్న వారు అంకిత్ సోనీని ఉదాహరణగా చూపాలని వీడియో చూసిన నెటిజన్స్ అంటున్నారు.