NTV Telugu Site icon

Vontimitta: రేపు ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణోత్సవం

Vontimitta

Vontimitta

Vontimitta: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం మోహిని అలంకారంలో కోదండ రాముడు భక్తులకు దర్శనమిచ్చారు. భాజా భజంత్రీలు,కేరళా డప్పు వాయిద్యాలు మధ్య నేత్రపర్వంగా పురవీధుల్లో గ్రామోత్సవం కోలాహలంగా సాగింది. పెద్ద ఎత్తున భక్తజన సందోహం తరలి వచ్చారు. ఇదిలా ఉండగా.. రేపు ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది. రాములోరి కల్యాణం కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పండు వెన్నెల రాత్రిలో జరగనున్న రాముల వారి కల్యాణోత్సవం జరగనుంది.

Read Also: Telangana Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. తేదీని వెల్లడించిన అధికారులు

ఈ నెల 17న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 25 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా అన్ని విభాగాలు సమన్వయం చేసుకుంటూ పని చేస్తున్నాయి. ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వేసవి నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు పడకుండా చలువ పందిళ్లు, తాగునీరు అందుబాటులో ఉంచారు. భక్తులకు తీర్థప్రసాదాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.