NTV Telugu Site icon

Donald Trump: జెలెన్‌స్కీకి ట్రంప్‌ హామీ.. ఇక యుద్ధం ఆపేస్తా..

Donald Trump And Volodymyr Zelensky Phone Call

Donald Trump And Volodymyr Zelensky Phone Call

Donald Trump and Volodymyr Zelensky phone call: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఫోన్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో గడిచిన రెండున్నరేళ్లుగా రష్యాతో చేస్తోన్న ఘర్షణ ఆగేలా చూస్తానని ట్రంప్ హామీ ఇచ్చాడు. జెలెన్‌స్కీ తో ఫోన్ కాల్ అనంతరం తమ మధ్య మంచి సంభాషణ జరిగిందని ఈ మేరకు ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ ఫోన్‌ కాల్ లో అనేక అంశాల గురించి మాట్లాడుకున్నాం.. రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సు విజయవంతమైనందుకు తనకి జెలెన్‌స్కీ అభినందనలు తెలిపారని., ఇంకా నాపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారని తెలిపాడు. ఆయన నన్ను సంప్రదించినందుకు అభినందిస్తున్నానని.. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా తాను ప్రపంచానికి శాంతిని తీసుకొస్తానని.. ఇంకా ప్రపంచంలోని చాలా మంది జీవితాలను, లెక్కలేనన్ని కుటుంబాలను నాశనం చేసిన యుద్ధాన్ని ఆపుతానని తెలిపారు.

Mark Zuckerberg: ట్రంప్ తెగువ నాలో స్ఫూర్తిని నింపింది..

వీటితోపాటు, నవంబర్‌ నెలలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే.. జనవరిలో అధికారం చేపట్టకముందే ఉక్రెయిన్ యుద్ధానికి ముగిసేందుకు చర్యలు తీసుకుంటానని, తాను 2022లో అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే మాత్రం అసలు ఈ యుద్ధం మొదలయ్యేది కాదని ఆయన అన్నారు. కేవలం కొన్ని చర్చల ద్వారా యుద్ధాలను ఆపేసి, ప్రపంచ శాంతిని నెలకొల్పుతానని ఆయన తెలిపాడు. ఇక ఈ విషయాన్ని జెలెన్‌స్కీ కూడా ధ్రువీకరించారు. దింతో ఆయన X లో స్పందిస్తూ.. ‘రిపబ్లికన్ అభ్యర్ధిగా నామినేట్ అయిన డొనాల్డ్ ట్రంప్‌ కు శుభాకాంక్షలు.. పెన్సిల్వేనియాలో జరిగిన హత్యాయత్నం తనని దిగ్భ్రాంతికి గురిచేసిందని.. భవిష్యత్తులో అతనికి బలం, సంపూర్ణ భద్రత ఉండాలని తాను కోరుకుంటున్నట్లు.. అలాగే రష్యా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా చేస్తున్న సహకారంపై కృతజ్ఞతతో ఉంటామని తెలిపారు.. ఇకపోతే ఇంకా మా దేశ నగరాలు, గ్రామాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయని.. అయినప్పటికీ శాంతి చర్చలకు మేము సుముఖంగా ఉన్నామని., శాంతి శాశ్వతంగా ఉండేలా ఏ చర్యలు తీసుకోవచ్చో వ్యక్తిగత సంభాషణలో అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన అంశాలే మేము ఏకీభవించామని ఆయన అన్నారు.

Mohammed Shami: ఎట్టకేలకు సానియా మీర్జాతో పెళ్లి పుకార్లపై మౌనం వీడిన టీమిండియా క్రికెటర్..