Site icon NTV Telugu

Minister Roja Vs TDP: వాయిస్‌ కాల్స్‌ వార్‌ పీక్స్‌కి.. చిత్తూరు జిల్లాలో పొలిటికల్‌ హీట్‌..

Roja

Roja

Minister Roja Vs TDP: వాయిస్‌ కాల్స్‌ వార్‌ ఇప్పుడు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో హీట్‌ పుట్టిస్తుంది.. మంత్రి ఆర్కే రోజాపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషం విదితమే కాగా.. దీనిపై దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఇదే వ్యవహారంలో చిత్తూరు జిల్లాలో పొలిటికల్‌ వాయిస్ కాల్స్ వార్ పిక్స్ కి చేరింది. ఇన్నాళ్లు సోషియాల్ మిడియా వేదికగా మంత్రి ఆర్కే రోజా, నగరి టీడీపీ ఇంఛార్జ్‌ భాను ప్రకాష్ మధ్య నడుస్తోన్న వార్.. ఇప్పుడు కొత్త పుంతలు తొక్కింది. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసినా వ్యక్తులను ఖండిస్తూ జిల్లాలో కొందరికి వాయిస్ కాల్ వచ్చాయి.. అందులో బండారు చేసిన విమర్శలతో పాటు మంత్రి రోజా తన పడిన కష్టం, ఆవేదన చెప్పుకొచ్చారు.. అంతేకాదు తనకు మద్దతుగా నిలవాలని ఇలాంటి వాటికి తాను ఏమాత్రం భయపడను అని పేర్కొన్నారు.

Read Also: Ravi Teja: ‘టైగర్ నాగేశ్వరరావు’కు దొరకని థియేటర్లు.. మండిపడుతున్న ఫ్యాన్స్..

అయితే, ఆ వాయిస్ కాల్స్ కి కౌంటర్ గా నగరి టీడీపీ నేతలు మంత్రి ఆర్కే రోజా సంచలనం వాయిస్ కాల్ లీక్ అంటూ ఓ ఆడియో సోషల్‌ మీడియాలో వదిలారు. నగరితో పాటు జిల్లా మొత్తం అది వైరల్ అయ్యింది. ఆ ఆడియోను ఓపెన్ చేసిన వారికి గతంలో రోజా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబాన్ని, ఇతర నేతలను దూషించిన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. వాటిని కట్ చేసి ఆ ఆడియో రూపంలో ఉండటంతో నగరి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు షాక్ గురవుతున్నారు.. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయ్యేలా ఉందనే చర్చ వారిలో సాగిందటా.. అలా నగరి వేదికగా తాజాగా సాగుతున్న వాయిస్ ఆడియో వార్ ఇప్పుడు జిల్లా మొత్తం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు.. రోజాకు మద్దతుగా కొందరు సినీ స్టార్స్‌ వీడియోలు విడుదల చేస్తుండగా.. సోషల్‌ మీడియాలో వారికి కూడా కౌంటర్లు పడుతున్నాయి.. వారి పెట్టిన పోస్టుల కింద.. గతంలో రోజా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను పెడుతున్నారు కొందరు నెటిజన్లు.. మరి ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.

Exit mobile version