Site icon NTV Telugu

Vodafone Idea Recharge: ‘వొడాఫోన్‌ ఐడియా’ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌.. 90 రోజుల పాటు డిస్నీ సబ్‌స్క్రిప్షన్‌!

Vodafone Idea Vi

Vodafone Idea Vi

ప్రముఖ టెలికాం కంపెనీ ‘వొడాఫోన్‌ ఐడియా’ కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఓటీటీలకు ఆదరణ ఉన్న నేపథ్యంలో వినియోగదారులకు ఆ సేవల్ని అందించడానికి కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. ఆ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రూ.169. వొడాఫోన్‌ ఐడియా అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త ప్లాన్‌ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.

Also Read: Bengaluru Water Crisis: బెంగళూరులో నీటి సంక్షోబానికి కారణం ఏంటో తెలుసా?

వొడాఫోన్‌ ఐడియా కొత్తగా తీసుకొచ్చిన రూ.169 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ వ్యాలిడిటీ 30 రోజులు. ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ సదుపాయం, ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు ఉండవు. ఈ ప్లాన్‌లో మొత్తం 8జీబీ డేటా లభిస్తుంది. డేటాపై రోజువారీ పరిమితి లేదు. కావాలంటే వినియోగదారులు డేటాను ఒకరోజులోనే ఉపయోగించవచ్చు. ఈ రీఛార్జితో మూడు నెలల పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. అదనపు డేటా, ఓటీటీ బెన్‌ఫిట్స్‌ కావాలనుకునే వారు ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది.

Exit mobile version