Bengaluru Water Crisis: బెంగళూరులో నీటి సంక్షోబానికి కారణం ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Why Bengaluru Dacing a Water Crisis: ప్రస్తుతం బెంగళూరు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. అక్కడి వాసులు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా నీటి వినియోగంపై ఆంక్షలు విధించిందంటే.. అక్కడ పరిస్థితి ఏ రేంజ్‌లో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. స్నానానికి బదులు వైప్స్‌తో తుడుచుకోవడం, వంట సమన్లు ఎక్కువగా కడగకపోవడం, తినడానికి డిస్పీజబుల్ ప్లేట్స్ వాడుతూ.. జనాలు అడ్జస్ట్ అవుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఈ విధంగా ఉందంటే.. ఏప్రిల్, మే నెలల్లో నీటి కష్టాల ఏ రేంజ్‌లో ఉంటాయో అని బెంగళూరు వాసులు ఆందోళన చెందుతున్నారు.
నీటి సమస్య కారణంగా పలు కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చేశాయి. దాంతో చాలామంది టెక్కీలు కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారు. అక్కడే ఉన్న వారు నీటి కోసం ట్యాంకర్లను బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. సాధారణంగా 1000 లీటర్ల వాటర్ ట్యాంక్ నీటి ధర రూ.600-800 ఉండగా.. ఇప్పుడు రూ.2000 డిమాండ్ చేస్తున్నారట. ఇప్పుడు దేశవ్యాప్తంగా బెంగళూరు నీటి కష్టాలు హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ బెంగళూరు నీటి కష్టాలకు కారణాలేంటో ఓసారి చూద్దాం.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Also Read: Navjot Singh Sidhu: టీమిండియా అత్యుత్తమ బ్యాటర్ సచిన్ కాదు.. అతడే: నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు
బెంగళూరు నీటి సంక్షోబానికి ప్రధాన కారణం తక్కువ వర్షపాతం నమోదవ్వడమే. కర్ణాటకలో గత వర్షాకాలంలో 18% తక్కువ వర్షపాతం నమోదైంది. 2015 నుంచి ఇదే అత్యల్ప వర్షపాతం. దాంతో భగర్బజలాలు ఇంకిపోయాయి. వర్షాలు ఎక్కువగా లేకపోవడంతో కావేరి నదిలో నీటి మట్టం తగ్గి.. సాగునీటి, తాగునీటి సరఫరాకు ఇబ్బంది తలెత్తింది. ప్రస్తుతం బెంగళూరు వ్యాప్తంగా ఉన్న సగం బోర్లు ఎండిపోయాయి. ఐఐటీ గాంధీనగర్ ప్రొఫెసర్ విమల్ మిశ్రా మాట్లాడుతూ.. ‘దక్షిణ భారతదేశం చాలా భిన్నమైన జలాశయ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా రాతి ఉంటుంది. అందుకే జలాశయాలు ఎక్కువ నీటిని కలిగి ఉండవు’ అని అన్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!