Vladimir Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక విమానం కొన్ని గంటల్లో భారతదేశంలో ల్యాండ్ అవుతుంది. భారతదేశం-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పుతిన్ భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. ఆయన 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. భారత గడ్డపై దిగిన తర్వాత.. పుతిన్ ప్రత్యేక భద్రతా కవచంలో ఉంటారు. భారీ భద్రత మధ్య పుతిన్ రెండు రోజుల పర్యటన కొనసాగనుంది. పుతిన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అనేక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు పుతిన్ భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. రష్యా నాయకుడు ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత ఇది ఆయన మొదటి పర్యటన. చర్చల తర్వాత, ప్రధాన ప్రకటనలు, ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. తరువాత సంయుక్త మీడియా ప్రకటన విడుదల అవుతుంది.
ఈ కింద పేర్కొన్న రంగాల ఒప్పందాలు జరిగే అవకాశం..
- 2030 ఆర్థిక సహకార కార్యక్రమం
- రంగాలవారీ ఒప్పందాలు (వాణిజ్యం, శక్తి, వ్యవసాయం, ఆరోగ్యం, మీడియా మొదలైనవి)
- SU-57 స్టెల్త్ ఫైటర్ జెట్ ఒప్పందం
- ఎనర్జీ కార్పొరేషన్ డీల్ – మాడ్యులర్ రియాక్టర్
- చమురు రంగం
- సెక్యూరిటీ కార్పొరేషన్ ఒప్పందం
- రెలోస్ లాజిస్టిక్స్ సపోర్ట్ డిఫెన్స్ ఒప్పందం
- బ్రహ్మోస్ క్షిపణి ఆధునీకరణ
అలాగే.. పెరుగుతున్న వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్యం గురించి ప్రధాని మోడీ, పుతిన్ వివరంగా చర్చిస్తారని, 2024 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం 12 శాతం పెరిగి 63.6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని రష్యా దౌత్యవేత్త ఉషాకోవ్ అన్నారు. పెరుగుతున్న వాణిజ్య అసమతుల్యత గురించి భారతదేశం ఆందోళనలను పరిష్కరించడానికి రష్యా సిద్ధంగా ఉందని తెలిపారు..
