Vladimir Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొద్ది గంటల్లో భారత్ భూమిపై దిగబోతున్నారు. ఆయన ఓ ప్రత్యేక విమానంలో భారత్‌కు రానున్నారు. పుతిన్ ప్రయాణిస్తున్న స్పెషల్ విమానం IL-96-3000 PUE ను ‘ఆకాశంలో ఎగిరే కోట’ అని అంటారు. ఈ విమానం మీద మిసైల్స్ సైతం ప్రభావం చూపలేవు. పుతిన్ భద్రత అత్యంత హైటెక్ గా ఉంటుంది. పుతిన్ తల నుంచి పాదాల వరకు ప్రత్యేక దుస్తులు, భద్రత పరికరాలు ధరిస్తారు.
READ MORE: Team India: ఈ జెర్సీతోనే టీ20 ప్రపంచకప్‌లో భారత్ బరిలోకి దిగేది!
పుతిన్ ప్రయాణించే IL-96-3000 PUE విమానం అత్యంత శక్తివంతమైన భద్రతా వ్యవస్థలతో తయారైంది. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడే ఎయిర్ ఫోర్స్ వన్‌తో సమానంగా ఉంటుంది. ఇవి రెండూ కూడా ‘ఆకాశంలో ఎగిరే మిలిటరీ హెడ్‌క్వార్టర్’లాగానే పనిచేస్తాయి. పుతిన్ వాడే ‘ఒరస్ సెనాట్’ కార్ సైతం ప్రపంచంలోనే అత్యంత సురక్షిత కార్లలో ఒకటి. ఆ కారును కూడా రష్యా నుంచి పుతిన్ బృందం ఢిల్లీకి తీసుకువస్తోంది. పుతిన్ కోసం ఢిల్లీలో ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఆయన వద్ద ఎప్పుడూ సొంతంగా నాలుగు భద్రతా టీంలు ఉంటాయి. ఆధునిక ఆయుధాలతో ఉన్న బాడీగార్డులు, డమ్మీ (నకిలీ) పుతిన్, వడ్డించే ఆహారాన్ని ముందుగా పరీక్షించే గార్డులు ఉంటారు. ఢిల్లీలో బాహ్య భద్రతను NSG కమాండోలు చూసుకుంటారు. అలాగే SPG, NSG, RAW, IB, ఢిల్లీ పోలీస్ తమ తన భద్రతా వలయాలను ఏర్పాటు చేస్తాయి. బయట నుంచి డ్రోన్ జామర్లు, AI మానిటరింగ్, యాంటీ స్నైపర్ టీమ్ కూడా పని చేస్తాయి.
పుతిన్ డిసెంబర్ 4న సాయంత్రం 6 గంటలకు భారత్‌కు చేరుకుంటారు. డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్‌లో అధికారిక స్వాగతం ఉంటుంది. తరువాత హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు, భోజనం, ఒప్పందాల ప్రకటన జరుగుతాయి. సాయంత్రం రాష్ట్రపతి విందు కూడా ఉంటుంది. భారత్–రష్యా స్నేహం చాలా సంవత్సరాల నుంచి బలంగా కొనసాగుతోంది. రక్షణ, వ్యూహాత్మక రంగాల్లో ఇరు దేశాల సంబంధాలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. పుతిన్ సైతం ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పారు. భారత్‌కు రష్యా నుంచి మరిన్ని S-400 క్షిపణి రక్షణ వ్యవస్థలు కొనుగోలు చేసే అవకాశంపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.
