NTV Telugu Site icon

VJS50 Maharaja: ఎవరయ్యా ఆ ‘లక్ష్మి’.. మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ తో ముందుకొచ్చిన విజయ్ సేతుపతి..

Maharaja

Maharaja

కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కథను నమ్మి సినిమా చేసే పాన్ ఇండియన్ హీరోలలో ఒకరు. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటించిన తాజా చిత్రం ‘మహారాజా’. తాజాగా సినిమా మేకర్స్ తమ రాబోయే చిత్రం మక్కల్ సెల్వన్ 50 (VJS50) ట్రైలర్‌ ను విడుదల చేశారు. కేకే నగర్‌లోని ఓ బ్యూటీ సెలూన్ యజమానిగా విజయ్ సేతుపతి కనిపించనున్నాడని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. ఇక ఈ ట్రైలర్ లో లక్ష్మి తన ఇంట్లో దొంగిలించబడిందని ఫిర్యాదు చేయాలనుకున్న విజయ్ సేతుపతి, తాను ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయడానికి వచ్చానని పోలీసులకు చెప్తాడు.

T20 World Cup 2024: టీమిండియా మ్యాచ్‌ పూర్తి షెడ్యూల్ ఇలా.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడొచ్చంటే..

లక్ష్మి అంటే నగలు, పెట్టెలు, కాగితాలు కాదని అంటూ.. అలాగే కుమార్తె కాదు, భార్య కాదు, సోదరి కాదు.. లక్ష్మి ఎవరు అనే డైలాగ్స్ సినిమాకు క్యూరియాసిటీని పెంచాయి. థియేటర్లలో లక్ష్మి ఎవరో చూడాలని దర్శకుడు సినిమా చుట్టూ బజ్ క్రియేట్ చేయడంలో విజయం సాధించాడని చెప్పవచ్చు.

Bujji and Bhairava Animated: బుజ్జి, భైరవ చేసిన అడ్వెంచర్ మాములుగా లేదుగా.. ట్రైలర్ చూశారా..

కురంగు బొమ్మై ఫేమ్ నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, నట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు.