Vijayanagaram: విజయనగరం జిల్లాలోని గుర్ల మండలం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో పెను ప్రమాదం తప్పింది. పాఠశాల విద్యార్థులు సుమారు 30 మందికి విద్యుత్ షాక్ తగలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనతో అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక అధికారులు గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పాఠశాల గోడకు ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభం నుంచి ఒక విద్యుత్ వైరు తెగిపడటం లేదా గోడకు అనుకొని ఉన్న క్లాస్ రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ సంభవించడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
Weather Updates : తెలంగాణకు అర్ధరాత్రి హై అలెర్ట్.. తీరాన్ని తాకిన ‘మొంథా’
ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 30 మంది విద్యార్థులు ఆ గోడను పట్టుకొని ఉండడంతో వారికి ఏకకాలంలో కరెంట్ షాక్ తగిలింది. విద్యుత్ షాక్‌కు గురైన విద్యార్థులను వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన విద్యార్థులలో సుమారు ఐదుగురి పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని నెల్లిమర్లలోని సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ, విద్యా శాఖ అధికారులు హుటాహుటిన పాఠశాలకు చేరుకుని ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణాలపై విచారణ చేపట్టారు.
Viral Video: ఈ డాక్టర్ కు బీపీ ఎక్కువా ఏంటీ?.. వైద్యం కోసం పోతే చెంప చెల్లుమనిపించిందిగా..
