Vizag Fishing Harbour Fire Incident: ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాదంలో ఘటనలో మరో ట్విస్ట్‌.. ఆ ఇద్దరు ఎవరు..?

Vizag

Vizag

Vizag Fishing Harbour Fire Incident : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాదంలో ఘటనలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగు చూస్తున్నాయి.. మొదట యూ ట్యూబర్‌ లోకల్‌ బాయ్‌ నానిపై ఆరోపణలు వచ్చినా.. ఆ తర్వాత అతని పాత్ర లేదనే నిర్ధారణకు వచ్చారు. అయితే, తనను అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ హైకోర్టు మెట్లు ఎక్కాడు నాని.. ఆ పిటిషన్‌పై సోమవారం ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది..

Read Also: Shruti Haasan : శృతిహాసన్ పాటకు నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..

×
×
Ad

మరోవైపు.. ఫిషంగ్ హర్బర్ అగ్నిప్రమాదంలో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది.. ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో కీలక ఆధారాలు సేకరించారు విశాఖ పోలీసులు.. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ విడుదల చేశారు.. 10:48 నిమిషాలకి హడావుడిగా బోటు నుండి ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చినట్టు ఆ సీసీ టీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తుండగా.. ఆ తర్వాత రెండు నిమిషాల వ్యవధిలోనే అంటే రాత్రి 10:50కి అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదం ప్రారంభ దశలో వెలుగులోకి వచ్చింది మరో వీడియో.. అయితే, అగ్ని ప్రమాదానికి ముందే హార్బర్ లో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్న ఆ ఇద్దరు ఎవరు? అనే కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది.. ఎన్ టీవీకి చిక్కిన ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం సీసీ టీవీ ఫుటేజ్‌ను చూసేందుకు కింది వీడియోను క్లిక్‌ చేయండి..