NTV Telugu Site icon

Vizag Student Death Case: ఇంజనీరింగ్ విద్యార్ధి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్

Vizag 1

Vizag 1

విశాఖపట్నం జిల్లా మర్రిపాలెం రైల్వే ట్రాక్ పై ఇంజనీరింగ్ విద్యార్థి పవన్ అనుమానాస్పద మృతి కేసులో మరో ట్విస్ట్ బయటకు వచ్చింది. ఆత్మహత్యగా అనుమానించేందుకు లభించింది ఓ ఆధారం. సెల్ ఫోన్ లో వున్న ఎస్ఎంఎస్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. పవన్ మొబైల్ నుంచి తల్లిదండ్రులకు పంపించిన మెసేజ్ వెలుగులోకి వచ్చింది. అమ్మానాన్న సారీ..నావల్ల ఎప్పటికైనా మీకు బాధలు తప్పవు.. నాకు ఇచ్చిన 6 వేలు, అన్నయ్యకి మొబైల్ కు ఇచ్చిన 7వేలు వాడేసాను. లక్ష రూపాయలు వరకు అప్పులు అయిపోయాను. నావల్ల మీకు భవిష్యత్తులో కూడా బాధలే ఉంటాయి.

Read Also: Delhi MCD Polls: ఢిల్లీ పీఠం ఆప్‌దే.. బీజేపీ ఆధిపత్యానికి గండి.. 134 స్థానాల్లో విజయం

నాన్న లవ్ యు… అంటూ పవన్ మొబైల్లో మెసేజ్ ను గుర్తించిన పోలీసులు దానిపై విచారణ జరుపుతున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి పవన్ మొబైల్ స్విచ్చాఫ్ చేసి వుంది. ఇప్పటి వరకు మెస్సేజ్ తనకు రాలేదంటున్నారు పవన్ తండ్రి. పవన్ అనుమానాస్పద మృతిపై విచారణ జరుగుతోంది. పవన్ తల వెనుక భాగంలో ఆరంగులాల గాయంతో పాటు.. ముఖం, ఎడమ భుజంపైన తీవ్ర గాయాలను పోలీసులు గుర్తించారు. రైల్వే ట్రాక్ పక్కన పవన్ మృతదేహం పడి ఉంది. పవన్ మృతదేహం పక్కనే కాలేజ్ బ్యాగ్‌ను జీఆర్పీ పోలీసులు గుర్తించారు. మృతుడు దాకమర్రి రఘు కాలేజీలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. పవన్‌ది హత్యగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన జీఆర్పీ పోలీసులు… పవన్ మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టామన్నారు. ఇదిలా వుంటే పవన్ నుంచి వెళ్ళిన మెసేజ్ పై తల్లిదండ్రులు ఇంకా స్పందించాల్సి వుంది. పవన్ ఆత్మహత్య చేసుకున్నాడా… ఎలా మరణించాడన్నది తేలాల్చి వుంది.

Read Also: CM KCR: అందరి స‌మ‌ష్టి కృషితో.. దేశంలోనే అనేక విషయాల్లో నంబర్ వన్‌లో ఉన్నాం