Site icon NTV Telugu

Visakha Fishing Harbour Fire Incident: ఫిషింగ్ హార్బర్‌లో బోట్ల దగ్ధం కేసు.. అసలు కారణం బయటపెట్టిన సీపీ

Harbour Fire Accident

Harbour Fire Accident

Visakha Fishing Harbour Fire Incident: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన బోట్ల దగ్ధం కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. ఘటన జరిగిన 6 రోజులకు అసలు నిందితులను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించనున్నారు. సుమారు 47 సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన అనంతరం నిందితులను గుర్తించారు. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న సుమారు 30 మందిని విచారణ చేశారు.. నిందితులు వాసుపల్లి నాని, అతని మామ సత్యం ఇద్దరు మద్యం మత్తులో చేసిన తప్పిదమే ఈ భారీ అగ్ని ప్రమాదాలకు కారణమని తేల్చారు.. ఈ కేసు దర్యాప్తుల భాగంగా యూట్యూబర్ నానిని కేవలం అనుమానితుడిగానే పరిగణించామని తెలిపారు.

Also Read: Pawan Kalyan: విడివిడిగా వెళ్లడం వల్లే వైసీపీకి ప్లస్ అయ్యింది..

విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వాసుపల్లి నాని, అతని మామ సత్యం అనే వీరిద్దరే ప్రమాదానికి అసలు కారణమని.. 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు వీరిద్దరూ మద్యం తాగడానికి హార్బర్ కు వచ్చారని చెప్పారు. అల్లిపల్లి వెంకటేశ్‌కు చెందిన 887 నెంబర్ బోటులో మద్యం తాగి ఫిష్ ప్రై చేసుకోని పార్టీ చేసుకున్నారని.. అనంతరం సిగరెట్ తాగి పక్కనా ఉన్న 815 నెంబర్ బోటుపై పడేసారు.. దీంతో మెల్ల మెల్లగా మంటలు చెలరేగి బాగా వ్యాపించాయని సీపీ తెలిపారు. మంటలు వ్యాపించడం గమనించి మెల్లగా అక్కడి నుండి జారుకున్నారన్నారు. వాసుపల్లి నాని అక్కడ బోట్లలో కుక్‌గా, సత్యం వాచ్ మెన్‌గా పనిచేస్తుంటారని, వారి ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 437,438,285, ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసు దర్యాప్తు లో భాగంగా చాలా మంది అనుమానితులను విచారించామన్నారు. విచారించిన అనుమానితుల్లో ముగ్గురు నానిలు ఉన్నారన్నారు. విచారణలో భాగంగా యూట్యాబర్ నానిని తీసుకొచ్చి విచారణ చేశామని.. ప్రాథమిక సమాచారం మేరకు కేవలం విచారణలో భాగంగానే నానిని తీసుకువచ్చామన్నారు.

Also Read: Purandeswari: రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు విలయ తాండవం చేస్తుంది..

విచారణలో అతని ప్రమేయం లేదంటే మేము ప్రోసిజర్ ప్రకారం విడిచిపెట్టే వాళ్లమని చెప్పారు. కానీ ఈ లోపే హైకోర్టును అశ్రయించారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సుమారు 50కు పైగా సీసీ కెమెరాలు పరిశీలించామన్నారు. ఇన్ని రోజులు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామని, నిందితులు సిగరెట్ విసిరివేయడంతో వలలకు నిప్పు అంటుకున్న తరువాత మొదట పొగలు మాత్రమే వచ్చాయన్నారు. ఆ సమయంలో గాలులు కూడా బాగా వీయడంతో మంటలు త్వరగా వ్యాపించాయన్నారు. నిందితులు ఉదయం నుంచి తాగుతూనే ఉన్నారని.. విచారణలో వారు నేరం అంగీగరించారన్నారు. ఈ ప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా దగ్ధం అవ్వగా.. 18 బోట్లు పాక్షికంగా డామేజ్ అయ్యాయన్నారు. 8 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని, ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కమాండ్ కంట్రోల్ ద్వారా హార్బర్ మానిటరింగ్ చేస్తామన్నారు.

 

Exit mobile version