గత కొద్ది రోజుల నుండి విశాఖ బీచ్ రోడ్డులో హల్ చల్ చేస్తున్న బైక్ రేసర్ల భరతం పట్టారు పోలీసులు. ఎన్టీవీలో ప్రసారం అయిన వార్తలకు స్పందన లభించింది. వరుస కథనాలతో పోలీస్ యంత్రాంగం కదిలింది. నగరంలో పలు చోట్ల నిఘా పెట్టి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశారు. బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న యువకులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు. విశాఖలో బైక్ రేసింగ్‌లపై పోలీస్ కమిషనర్ సీరియస్ అయ్యారు.
బీచ్ రోడ్లు, ఖాళీ ప్రదేశాల్లో మోడల్ బైకులుతో రేసింగ్‌లు, మితిమీరిన వేగం ప్రమాదకర విన్యాసాలతో రెచ్చిపోతున్నారు బైక్ రేసర్లు. వికెండ్స్ లో సాగర్ నగర్, జోడు గుళ్ల పాలెం, రుషి కొండ, భీమిలి ప్రాంతాల్లో మద్యం మత్తులో, గంజాయి మత్తులో జోరుగా బైక్ రేసింగ్‌లు జరుగుతున్నాయి. బైక్ రేసర్ల ఆగడాలతో వాహనదారులు హడలి పోతున్నారు. ఇంస్టాగ్రామ్ లో గ్రూపులు ఏర్పాటు చేసుకొని మరి యువత రేసింగ్లలో పాల్గొంటున్నారు. 30 మంది యువకులపై కేసుల నమోదు చేసి 38 మోడల్ బైకులు స్వాధీనం చేస్తున్నారు పోలీసులు.