Site icon NTV Telugu

Vizag Ayesha Masjid Case: వక్ఫ్ బోర్డుకు హైకోర్టు చురకలు.. ఉత్తర్వులు అమలుచేయకపోవడంతో అధికారికి కోర్టు ధిక్కరణ పిటిషన్

Vizag Ayesha Masjid

Vizag Ayesha Masjid

Vizag Ayesha Masjid Case: విశాఖపట్నంలోని సాగర్‌నగర్‌లోని అయేషా మసీదు పేరుతో ఉన్న అనధికార కట్టడంపై వివాదం మళ్లీ హైకోర్టు దృష్టికి వచ్చింది. హైకోర్టు ఇచ్చిన గత ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో వక్ఫ్ బోర్డు, జీవీఎంసీ అధికారులపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాగర్‌నగర్ లేఅవుట్ సొసైటీకి చెందిన స్థానికులు, ఆ మసీదు కట్టడం అనధికారమని ఆరోపిస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే విచారణ అనంతరం ఆ కట్టడంపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వుల అమలుపై వక్ఫ్ బోర్డు రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది.

IPL 2026: ముంబై ఇండియన్స్ భారీ ట్రేడ్స్‌.. శార్దూల్ ఠాకూర్‌, రుదర్‌ఫోర్డ్ ఇన్.. అర్జున్ టెండూల్కర్ అవుట్..!

తాజాగా ఈ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో జీవీఎంసీ కమిషనర్‌పై ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. సొసైటీ తరఫు న్యాయవాది కోర్టులో వాదిస్తూ.. అనధికార కట్టడంపై నకిలీ పత్రాలతో పిటిషన్ వేసినట్లు వక్ఫ్ బోర్డు ప్రవర్తనను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఆ కట్టడాన్ని తక్షణమే కూల్చివేయాలని కోరారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సక్రమమని అభిప్రాయపడింది. అనధికార కట్టడాన్ని తొలగించాలని ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ.. వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ తీర్పుతో సాగర్‌నగర్‌లోని అయేషా మసీదు వివాదంపై మరోసారి స్పష్టత వచ్చినట్టయింది. హైకోర్టు నిర్ణయంతో జీవీఎంసీ అధికారులు అనధికార నిర్మాణంపై చర్యలు తీసుకోనున్నారు.

Nagarjuna – Konda Surekha : కొండా సురేఖకు భారీ ఊరట.. కేసు వాపస్ తీసుకున్న నాగర్జున

Exit mobile version