Site icon NTV Telugu

VIVO Y400 Pro 5G: 6.77 అంగుళాల కర్వుడ్ స్క్రీన్‌, 5500mAh భారీ బ్యాటరీ లాంటి ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చేసిన వివో Y400 ప్రో..!

Vivo Y400 Pro 5g

Vivo Y400 Pro 5g

VIVO Y400 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో, తన తాజా Y-సిరీస్‌ మోడల్ అయిన వివో Y400 Pro 5G ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన ఫీచర్లు, ఫ్లాగ్‌షిప్ స్థాయి డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యం లాంటి ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో ఈ ఫోన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మరి ఈ కొత్త మొబైల్ పూర్తి ఫీచర్లను ఒకసారి చూద్దామా..

డిస్‌ప్లే, డిజైన్:
ఈ ఫోన్‌ 6.77 అంగుళాల 3D కర్వుడ్ AMOLED స్క్రీన్‌తో వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో పాటు, పీక్స్ బ్రైట్‌నెస్ 4500 నిట్స్ వరకు ఉండటం విశేషం. దీనివలన, ఎండలోనైనా స్పష్టంగా స్క్రీన్ కనిపిస్తుంది. ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా స్క్రీన్ పై ఏర్పాటు చేశారు.
Read Also: CBI: ఇంటర్‌పోల్ సహకారంతో నకిలీ కరెన్సీ నోట్ల కేసు నిందితుడుని దేశానికి రప్పించిన సీబీఐ..!

కెమెరా ఫీచర్లు:
మొబైల్ వెనుక వైపు 50MP సోనీ IMX882 ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌తో కలిపి డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ‘ఔరా లైట్’ అనే ప్రత్యేక లైటింగ్ ఫీచర్ కలిగి ఉండటంతో ఫోటోలలో క్వాలిటీ సమతుల్యం చేయడంలో ఇది సహాయపడుతుంది. అలాగే మొబైల్ ముందువైపు 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఇది కూడా 4K వీడియో రికార్డింగ్‌కి సహాయపడుతుంది.

ప్రాసెసర్, స్టోరేజ్:
MediaTek Dimensity 7300 చిప్‌సెట్‌తో కూడిన ఈ ఫోన్‌లో 8GB RAM తో పాటు మరింత వేగం కోసం 8GB వర్చువల్ RAM కూడా ఉంది. స్టోరేజ్ ఎంపికల్లో 128GB, 256GB UFS 2.2 వేరియంట్లు ఉన్నాయి.
Read Also: Netanyahu: ఆమెరికా ఆదేశాల కోసం ఎదురుచూడలేం.. అణు స్థావరాలను మేమే ధ్వంసం చేస్తామన్న నెతన్యాహు

బ్యాటరీ:
ఈ మొబైల్ కేవలం 7.49mm మందంతో ఎంతో స్లిమ్‌గా ఉండటం ఓ ప్రత్యేకత. కానీ, ఇందులో మాత్రం 5500mAh భారీ బ్యాటరీ, దానికి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ రావడం నిజంగా చెప్పుకోతగ్గ విషయమే. దీనివల్ల కేవలం 19 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుంది.

ఇక మొబైల్ లో ఇతర ఫీచర్లను చూసినట్లయితే.. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Funtouch OS 15 ఉండనుంది. డ్యూయల్ సిమ్, Wi-Fi 6, Bluetooth 5.4, IP65 రేటింగ్ (డస్ట్ అండ్ వాటర్ స్ఫ్లాష్) రెసిస్టెన్స్, స్టీరియో స్పీకర్లు, USB Type-C ఆడియో సపోర్ట్ లభించనున్నాయి. ఈ మొబైల్ ఫ్రీ స్టైల్ వైట్, ఫెస్ట్ గోల్డ్, నెబ్యులా పర్పుల్ అనే మూడు రంగులలో లభిస్తుంది.

ధర:
ఈ మొబైల్ రెండు వేరియంట్స్ లో లభిస్తుంది. ఇందులో 8GB + 128GB వేరియంట్ ధరను రూ. 24,999 గా, 8GB + 256GB వేరియంట్ ను రూ. 26,999 గా నిర్ణయించారు. ఈ ఫోన్ జూన్ 27 నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా స్టోర్, ఇంకా ఆఫ్లైన్ స్టోర్లలో లభ్యం కానుంది. ప్రీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇక ఈ మొబైల్ సంబంధించి లాంచ్ ఆఫర్లు (జూన్ 20 – 30 వరకు) చూసినట్లయితే.. ఎంపిక బ్యాంక్ కార్డ్స్ పై 10% క్యాష్‌బ్యాక్ అందనుంది. ప్రీ బుకింగ్స్ చేసుకుంటే TWS 3e ANC ఇయర్‌బడ్స్ కేవలం రూ. 1499కే లనిస్తాయి. అలాగే V-Shield ప్లాన్‌పై 20% తగ్గింపు, అలాగే మొబైల్ కు 1 సంవత్సరం ఎక్స్‌టెండెడ్ వారంటీ ఉచితంగా లభించనుంది. అంతేకాకుండా జియో రూ. 1199 ప్లాన్‌పై 10 OTT Apps కు 2 నెలలు ఉచిత ప్రీమియం యాక్సెస్ లభించనుంది.

Exit mobile version