NTV Telugu Site icon

Vivo Y28s 5G Price: వై28ఎస్‌ 5జీ ఫోన్‌ ధరను తగ్గించిన వివో.. ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్స్ అదనం!

Vivo Y28s 5g Price

Vivo Y28s 5g Price

Vivo Y28s 5G Price and Offers: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’ గత జూలైలో ‘వివో వై28ఈ’ 5జీ ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. తక్కువ ధరలో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ధరను వివో తగ్గించింది. దాంతో మీరు వివో వై28ఈని చౌకగా కొనుగోలు చేయగలుగుతారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ ధర, ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్స్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.

రిలీజ్ అయిన మూడు నెలల్లోనే కంపెనీ వివో వై28ఈ స్మార్ట్‌ఫోన్ ధరలను తగ్గించింది. 4జీబీ+128జీబీ ఫోన్ రూ.13999, 6జీబీ+128జీబీ ఫోన్ రూ.15499, 8జీబీ+128జీబీ ఫోన్ రూ.16999లకు లాంచ్ చేసింది. తాజాగా ఈ మూడు వేరియంట్‌లపై రూ.500 ధరను తగ్గించింది. దాంతో 4జీబీ వేరియంట్‌ రూ.13499, 6జీబీ వేరియంట్‌ రూ.14999, 8 జీబీ వేరియంట్‌ 16499లకే లభిస్తాయి. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై 10 శాతం తగ్గింపు ఉంది. వింటేజ్ రెడ్, ట్వింక్లింగ్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు లభిస్తాయి.

Also Read: Honor 200 Pro Price: అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. హానర్‌ 200 ప్రోపై 14 వేల తగ్గింపు!

వివో వై28ఎస్‌ 5జీ స్పెసిఫికేషన్స్:
# 6.56 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే
# మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్
# ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 14
# 50 మెగా పిక్సెల్ సెన్సర్ ప్రైమరీ కెమెరా, 0.08 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా
# 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
# 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ (15 వాట్స్‌ వైర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్‌)

 

Show comments