చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘వివో’ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. ‘వివో వై18టీ’ని లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్ ఈ ఫోన్ సొంతం. 50 మెగాపిక్సెల్స్ కెమెరా, 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని ఇందులో ఇచ్చారు. ఈ ఫోన్ ధర రూ.10 వేల లోపే ఉంది. అయితే ఇది 5జీ స్మార్ట్‌ఫోన్ మాత్రం కాదు. వివో వై18టీ 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది.
వివో వై18టీ ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్ ధర భారతదేశంలో రూ.9,499గా ఉంది. జెమ్ గ్రీన్, స్పేస్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్‌లో కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్‌లో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఉంది. 1612 x 720 పిక్సెల్ రిజల్యూషన్, 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. 269 పిక్సల్ డెన్సిటీ, 840 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. ఈ ఫోన్ Unisoc T612 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
Also Read: Realme Narzo 70 Curve: రియల్‌మీ నార్జో సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ ఎక్కువ, ధర తక్కువ!
వివో వై18టీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్‌టచ్ ఓఎస్ 14తో పనిచేస్తుంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రైమరీ కెమెరాలో 50-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. సెన్సార్ డెప్త్ సెన్సింగ్ ఫంక్షనాలిటీ కోసం సెకండరీ కెమెరాలో 0.08-మెగాపిక్సెల్ ఉంది. సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5,000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ54 రేటింగ్‌ను ఇచ్చారు.