Price Change: 200MP కెమెరా, 6510mAh బ్యాటరీ, 16GB RAM గల Vivo ఫోన్.. ధరలో మార్పులు..

Vivo

Vivo

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Vivo తమ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడల్ Vivo X300 Pro ధరను భారత్‌లో రూ. 10,000 వరకు పెంచింది. డిసెంబర్ 2025లో 16GB RAM + 512GB స్టోరేజ్ ఏకైక వేరియంట్‌తో రూ. 1,09,999 కి విడుదలైన ఈ ఫోన్ ధర, తాజాగా రూ. 1,19,999 కి చేరింది. ఈ కొత్త ధరలు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు మరియు ఆఫ్‌లైన్ రీటైల్ స్టోర్లలో అమల్లోకి వచ్చాయి.

అయితే, కంపెనీ ఈ హఠాత్తు ధరల పెంపునకు గల అధికారిక కారణాలను ఇంకా వెల్లడించలేదు. ఫీచర్ల విషయానికొస్తే.. Vivo X300 Pro అత్యంత శక్తివంతమైన MediaTek Dimensity 9500 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది Android 16 ఆధారిత Funtouch OS తో వస్తూ, అనేక ఆధునిక AI ఫీచర్లను అందిస్తుంది. దీనిలో 6.82 అంగుళాల AMOLED curved డిస్ప్లే ఇచ్చారు, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, అధిక బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. కెమెరా విభాగంలో దీనికి తిరుగులేదు. 200MP ZEISS APO టెలిఫోటో కెమెరాతో పాటు, 50MP ప్రైమరీ మరియు 50MP ఆల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి.

ఇక సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌లో 6510mAh భారీ బ్యాటరీ ఉంది. దీనికి 90W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అంతేకాకుండా.. నీరు, ధూళి నుండి పూర్తి రక్షణ కోసం IP68 మరియు IP69 రేటింగ్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, Wi-Fi 7 మరియు Bluetooth 6.0 వంటి అధునాతన కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.