Vivo X200 Series: వివో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న నిరీక్షణ ముగిసింది. కంపెనీ తన Vivo X200 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ సిరీస్‌లో రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌లు Vivo X200, Vivo X200 Pro ఉన్నాయి. ప్రో మోడల్‌లో 200-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీ ఉంది. భారతదేశంలో ఈ మొబైల్స్ OPPO Find X8 సిరీస్, iQOO 13, Realme GT 7 ప్రో వంటి ఇతర స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడుతుందది. మీరు వివో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే దాని ధర, పూర్తి ఫీచర్ల పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం.
Also Read: Bengaluru Techie Suicide: అర్ధరాత్రి ఇంటి నుంచి పరారైన అతుల్ సుభాష్ భార్య కుటుంబం..
Vivo X200, x200 Pro రెండూ వేయు వేరు రెండు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. X200 ఫోన్ కాస్మోస్ బ్లాక్, నేచురల్ గ్రీన్ రంగులలో అందుబాటులో ఉండగా.. ప్రో మోడల్ కాస్మోస్ బ్లాక్, టైటానియం గ్రే రంగులలో లభిస్తుంది. ఇక ధర పరంగా చూస్తే.. Vivo X200 12GB + 256GB వేరియంట్ ధర రూ. 65,999 కాగా, దాని 16GB + 512GB వేరియంట్ ధర రూ.71,999గా నిర్ణయించారు. Vivo X200 Pro వచ్చిన సింగిల్ వేరియంట్ 16GB + 512GB ధర రూ.94,999గా నిర్ణయించారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, రిటైల్ అవుట్‌లెట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ఈ బ్రాండ్ రెండు ఫోన్‌ల కోసం నేటి నుండి ప్రీ-బుకింగ్‌లను ప్రారంభిస్తోంది. అయితే వీటి విక్రయాలు మాత్రం డిసెంబర్ 19 నుండి ప్రారంభమవుతాయి. ఇక ఫోన్ లాంచ్ ఆఫర్ కింద, HDFC ఇంకా SBI కార్డ్‌లతో కొనుగోలు చేసే వినియోగదారులు రూ. 9,500 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ తోపాటు, రూ. 9,500 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందుతారు. వీటితోపాటు అమెరికన్ ఎక్స్‌ప్రెస్, DBS, IDFC ఫస్ట్ బ్యాంక్, HBD ఫైనాన్షియల్ సర్వీసెస్ లావాదేవీలపై 10% తక్షణ ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే కంపెనీ 10% V-అప్‌గ్రేడ్ బోనస్‌ను కూడా అందిస్తోంది.
ఇక Vivo X200 సిరీస్ ఫీచర్ల విషయానికి వస్తే.. Vivo X200 6.67-అంగుళాల 3D AMOLED ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120 Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది LTPS ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇది 4500 నిట్‌ల బ్రైట్నెస్ కలిగి ఉంది. ఇక ప్రో మోడల్ విషయానికి వస్తే.. 6.78 అంగుళాల 3D AMOLED ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 4500 నిట్‌ల బ్రైట్నెస్ కు మద్దతు ఇస్తుంది. రెండు ఫోన్‌లు మెడియటేక్ డిమెంసిటీ 9400 చిప్‌సెట్, Immortalis G925 GPUని ప్యాక్ చేస్తాయి. రెండు మొబైల్స్ Android 15 ఆధారంగా Funtouch OS 15ని కలిగి ఉన్నాయి.
Also Read: One Nation One Election: ‘‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు’’కు కేంద్ర కేబినెట్ ఆమోదం…
ప్రో మోడల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా ఉంది. ఇందులో OISతో 50-మెగాపిక్సెల్ సోనీ LYT-818 సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ ఇంకా 200-మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. ఇది Vivo V3+ ఇమేజింగ్ చిప్‌తో వస్తుంది. ఇది 4K HDR సినిమాటిక్ పోర్ట్రెయిట్ వీడియో అలాగే 60fps వద్ద 10-బిట్ లాగ్ వీడియో రికార్డింగ్ వంటి అధునాతన ఫీచర్‌లను అందిస్తుంది. ఈ రెండు మోడల్స్ సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే.., Vivo X200 మోడల్ లో 90W ఫ్లాష్‌ఛార్జ్ మద్దతుతో 5,800mAh బ్యాటరీ వస్తుంది. ఇక ప్రో మోడల్ 90W ఫ్లాష్‌ఛార్జ్, 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీని అందిస్తుంది. భద్రత కోసం రెండు ఫోన్‌లలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందుబాటులో ఉంది. రెండు ఫోన్‌లు దుమ్ము, నీటి నుండి సురక్షితంగా ఉండటానికి IP68 + IP69 రేటింగ్‌తో వస్తున్నాయి.