NTV Telugu Site icon

Vivo V40e Price: ఏఐ ఫీచర్లతో వివో వి40ఈ.. 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ!

Vivo V40e Price

Vivo V40e Price

Vivo V40e 5G Smartphone Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ ‘వివో’ ఏఐ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వీ సిరీస్‌లో భాగంగా ‘వివో వీ40ఈ’ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. వివో వీ40, వివో వీ40 ప్రోకు మంచి ఆదరణ దక్కడంతో వివో వీ40ఈను లాంచ్‌ చేసింది. వెట్‌ టచ్‌ ఫీచర్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో 50 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు. ఆకర్షణీయమైన డిజైన్‌తో లాంచ్ అయిన వివో వీ40ఈ ధర, ఫీచర్స్ వివరాలను ఓసారి చూద్దాం.

వివో వీ40ఈ ఫోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.28,999గా.. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.30,999గా కంపెనీ నిర్ణయించింది. మింట్‌గ్రీన్‌, రాయల్‌ బ్రాంజ్‌ రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్‌ 2 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. వివో ఇ- స్టోర్‌, వివో ప్రధాన స్టోర్లతో పాటు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఈ మొబైల్ కొనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేవారికి 6 నెలల నో- కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చు.

Also Read: Virat Kohli: కోహ్లీ జోరు తగ్గింది.. సచిన్ రికార్డులు అధిగమించడం కష్టమే!

వివో వీ40ఈలో 6.77 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ 3డీ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేటు, 4 ఎన్‌ఎం మీడియాటెక్‌ డైమన్సిటీ 7300 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌14తో ఇది వస్తోంది. ఐఓఎస్‌కు సపోర్ట్‌ చేసే 50 ఎంపీ సోనీ IMX882 ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కోసం 50ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఏఐ ఎరేజర్‌, ఏఐ ఫొటో ఎన్‌హాన్సర్‌ ఫీచర్లు ఉన్నాయి. 5500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. 80 వాట్స్ వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది.

Show comments