Site icon NTV Telugu

కొత్త పార్టీ పెట్టకండి… బీజేపీలోకి రండని ఈటలను ఒప్పించాను: వివేక్


హుజురాబాద్‌ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు. ఈ సంద ర్భంగా బీజేపీ నేత వివేక్‌ వెంకటస్వామి మాట్లాడుతూ కొత్త పార్టీ పెట్ట కండి… బీజేపీలోకి రండని ఈటలను ఒప్పించానని ఆయన చెప్పా రు. వారికి బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి ఆయనకు భరోసా ఇచ్చార న్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అని నిరూపించుకున్నామ న్నారు. ఈటల గెలుపును అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ నాయకులు శతవిధాల ప్రయత్నించారన్నారు.

అయినా కూడా హుజురాబాద్‌ ప్రజలు ఈటల రాజేందర్‌కే పట్టం కట్టారన్నారు. సీఎం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని దీనికి మనం సిద్ధంగా ఉండాలని వివేక్‌ వెంకటస్వామి బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సభకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో పాటు బండి సంజయ్‌, విజయశాంతి, లక్ష్మణ్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Exit mobile version