బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాల్క సుమన్ వ్యాఖ్యలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బాల్కసుమన్ వ్యాఖ్యలను జనం ఈసడించుకున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో మాట్లాడారు.. దాంతో ప్రజలు సరియైన గుణపాఠం చెప్పారు.అయినా బుద్దిరాలేదని, ఒళ్లు దగ్గర పెట్టుకోండి..సరిగా మాట్లాడండీ అని ఆయన హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉందని, కాని ఇంత దిగజారే విధంగా మాట్లాడొద్దని ఆయన అన్నారు.
Supreme Court: మేయర్ ఎన్నిక నిర్వహించేది ఇలానేనా? చండీగఢ్ ఆఫీసర్‌కి కోర్టు చీవాట్లు
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చారగొండ వెంకటేష్ మాట్లాడుతూ.. బాల్క సుమన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు. బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శిస్తే చెప్పు దెబ్బలు తప్పవన్నారు. బాల్క సుమన్ అమాయక విద్యార్థినుల జీవితాల తో ఆడుకున్న నీచుడని ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమం లో శ్రీకాంత చారి, వేణుగోపాల్ రెడ్డి చావుకు బాల్క సుమన్ కారణమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు తెలంగాణ కోసం కష్ట పడుతున్నారని ఆయన అన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వున్న కైలాష్ నేత మాట్లాడుతూ.. రెండు నెలల లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వొస్తున్న ఆధరణచూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చెప్పు చూపిస్తే తెలంగాణ ప్రజలు నిన్ను బట్టలుడదీసి కొడతరని, నీటి విషయం పై జరిగిన దోపిడీ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడితే హరీష్ రావు, కేటీఆర్, లు సమాధానం చెప్పలేక నోరు పారేసుకుంటున్నారన్నారు. బాల్క సుమన్ దళిత ద్రోహి, తిండికి లేక ,రబ్బరు చెప్పులతో తిరిగే నీకు వేల కోట్లు ఎలా వొచ్చాయని, బడుగు బలహీన వర్గాల ద్రోహి కేసీఆర్ కు కొమ్ము కాసిన నీకు తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. మీ పార్టీ అవినీతి పై రేపు అమరు వీరుల స్థూపం దగ్గర చర్చకు సిద్ధమా అని ఆయన అన్నారు.
Lok sabha: సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధాని మోడీ లాస్ట్ స్పీచ్