బాలీవుడ్ లో గత కొన్నాళ్ల నుంచి నెపోటిజం, బాలీవుడ్ సినిమా మాఫియాపై.. వాళ్లు తీసే సినిమాల గురించి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. బాలీవుడ్ లో ఉన్న పలువురు టాప్ హీరోలు, నిర్మాతలని.. వారి ఫ్యామిలీలని కొన్ని విషయాలలో విమర్శిస్తూనే ఉంటారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. మరి కొంతమంది బాలీవుడ్ మాఫియాపై ప్రతి రోజు విమర్శలు గుప్పిస్తునే ఉంటారు. అయితే, తాజాగా వివేక్ అగ్నిహోత్రి ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మరోసారి బాలీవుడ్ పై హాట్ కామెంట్స్ చేశారు.
Also Read : Bajrangdal protest: తెలంగాణకు తాకిన కర్ణాటక సెగ.. గాంధీ భవన్ వద్ద టెన్షన్
వివేక్ అగ్నిహోత్రి సినిమాల గురించి మాట్లాడుతూ.. నన్నైతే బాలీవుడ్ లో పూర్తిగా దూరం పెట్టారు.. నాకు మధ్యతరగతి ప్రజల్లో ఆడియన్స్ సపోర్ట్ బాగా ఉంది. బాలీవుడ్ సినిమాలు వాస్తవానికి దూరంగా ఉంటాయని అన్నారు. కరణ్ జోహార్ సినిమాల్లో చూపించినట్లుగా బయట దేశంలోని యువత అలా ఉండదు.. ఒకప్పుడు సినిమాలు చూస్తే వాటికి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేవారు.. ఇప్పటి సినిమాలకు కనెక్ట్ కావట్లేదు కాబట్టి ఎక్కువ పరాజయాలు చూస్తున్నారని.. అందుకే ప్రేక్షకులు బాలీవుడ్ ని విమర్శిస్తున్నారని.. వాటిని బాయ్ కాట్ చేస్తున్నారని వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యానించారు.
Also Read : Nuzvid IIIT: విద్యార్థుల ఆందోళనపై స్పందించిన ట్రిపుల్ ఐటీ యాజమాన్యం
ఇప్పుడు బాలీవుడ్ లో కొంతమంది నన్ను.. కంగనా రనౌత్ ను టార్గెట్ చేశారంటూ వివేక్ అగ్నిహోత్రి అన్నారు. బాలీవుడ్ లో జరిగే తప్పులని మేమిద్దరమే ప్రశ్నిస్తాం కాబట్టి మమ్మిల్ని దూరం పెడుతున్నారంటూ విమర్శించారు. తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు మాకు ఉంది.. అందుకే మా సినిమాలని, మమ్మిల్ని టార్గెట్ చేసి.. దూరం పెట్టి వేరు చేయాలనుకుంటున్నారు అని వివేక్ అగ్నిహోత్రి సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈ కామెంట్స్ పై ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి ఎవరు కూడా రియాక్ట్ కాలేదు..
