Vivek Agnihotri: చిత్రపరిశ్రమ నా సినిమాను బ్యాన్ చేసిందనుకుంటా.. డైరెక్టర్ సంచనలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంతమంది డబ్బుల కోసం కాకుండా తమ మనసుకు నచ్చిన సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. అటువంటి వారిలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లో కి వచ్చేశారు ఆయన. ఆ సినిమాతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ ఎంతటి సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ సినిమా తరువాత వివిక్ ‘ది వ్యాక్సిన్ వార్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు పడిన కష్టాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని ప్రమోషన్స్ లో భాగంగా వివేక్ అగ్నిహోత్రి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ తన సినిమా ‘ది వ్యాక్సిన్ వార్’ పై నిషేధం విధించినట్లుందని ఆయన అన్నారు. అందుకే ఇప్పటివరకు చిత్రపరిశ్రమకు చెందిన ఎవరూ ఈ సినిమా గురించి మాట్లాడలేదని అన్నారు. అంతేకాకుండా తన సినిమా గురించి రివ్యూలు రాయకుండా ఇప్పటికే చాలా మందికి డబ్బులు కూడా ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read: Vishnu Kumar Raju: ఒక్కొక్కరినీ జైల్లో పెట్టేకంటే ప్రజలందరినీ జైల్లో పెడితే సరిపోతుంది కదా..!
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
‘ది కశ్మీర్ ఫైల్స్’ విజయం అందుకున్నాక ఆ చిత్రానికి సీక్వెల్ రూపొందించాలని పేరు పొందిన నిర్మాణ సంస్థలు, వ్యక్తులు తనని సంప్రదించారని వెల్లడించిన ఆయన బాక్సాఫీస్ నంబర్ల కోసం పరుగులు పెట్టే రకాన్ని తాను కాదని చెప్పుకొచ్చారు. ది కశ్మీర్ ఫైల్స్ సీక్వెల్ కోసం దాదాపు రూ.300 కోట్లు ఇవ్వడానికి చూశారని కానీ తాను ఆ ఆఫర్ ను ఒప్పుకోలేదని ఆయన తెలిపారు. తక్కువ బడ్జెట్లో ‘ది వ్యాక్సిన్ వార్’ సిద్ధం చేశానని పేర్కొన్న ఆయన ‘ది కశ్మీర్ ఫైల్స్’కు వచ్చిన లాభాలను ఈ సినిమా నిర్మాణం కోసం ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు పడిన కష్టాన్ని ప్రజలకు చూపించాలనుకున్నానని అందుకే ‘ది కశ్మీర్ ఫైల్స్’కు వచ్చిన లాభాలను మొత్తం దీని మీద పెట్టినట్లు పేర్కొ్న్నారు. ఈ చిత్రానికి సరైన ఆదరణ రాకపోతే గతంలో లాగానే తన పరిస్థితి మారిపోతుందని ఆయన తెలిపారు. ఏ అంచనాలు లేకుండా వచ్చిన కశ్మీర్ ఫైల్స్ విజయం సాధించడంతో ఇప్పడు తీస్తున్న ది వ్యాక్సిన్ వార్ పై అంచనాలు పెరిగిపోయాయి.
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!