NTV Telugu Site icon

Vivek Agnihotri: చిత్రపరిశ్రమ నా సినిమాను బ్యాన్ చేసిందనుకుంటా.. డైరెక్టర్ సంచనలన వ్యాఖ్యలు

Vivek Agnihotri

Vivek Agnihotri

కొంతమంది డబ్బుల కోసం కాకుండా తమ మనసుకు నచ్చిన సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. అటువంటి వారిలో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ది కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లో కి వచ్చేశారు ఆయన. ఆ సినిమాతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ది కశ్మీర్‌ ఫైల్స్‌ ఎంతటి సక్సెస్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ సినిమా తరువాత వివిక్ ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. కరోనా సమయంలో వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు పడిన కష్టాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని ప్రమోషన్స్ లో భాగంగా వివేక్ అగ్నిహోత్రి పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమ తన సినిమా ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ పై నిషేధం విధించినట్లుందని ఆయన అన్నారు. అందుకే ఇప్పటివరకు చిత్రపరిశ్రమకు చెందిన  ఎవరూ ఈ సినిమా గురించి మాట్లాడలేదని అన్నారు. అంతేకాకుండా తన సినిమా గురించి రివ్యూలు రాయకుండా ఇప్పటికే చాలా మందికి డబ్బులు కూడా ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Also Read: Vishnu Kumar Raju: ఒక్కొక్కరినీ జైల్లో పెట్టేకంటే ప్రజలందరినీ జైల్లో పెడితే సరిపోతుంది కదా..!

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ విజయం అందుకున్నాక ఆ చిత్రానికి సీక్వెల్‌ రూపొందించాలని పేరు పొందిన నిర్మాణ సంస్థలు, వ్యక్తులు తనని సంప్రదించారని వెల్లడించిన ఆయన బాక్సాఫీస్‌ నంబర్ల కోసం పరుగులు పెట్టే రకాన్ని తాను కాదని చెప్పుకొచ్చారు.  ది కశ్మీర్‌ ఫైల్స్‌ సీక్వెల్ కోసం దాదాపు రూ.300 కోట్లు ఇవ్వడానికి చూశారని కానీ తాను ఆ ఆఫర్ ను ఒప్పుకోలేదని ఆయన తెలిపారు.  తక్కువ బడ్జెట్‌లో ‘ది వ్యాక్సిన్‌ వార్‌’ సిద్ధం చేశానని పేర్కొన్న ఆయన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు వచ్చిన లాభాలను ఈ సినిమా నిర్మాణం కోసం ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో వ్యాక్సిన్‌ కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు పడిన కష్టాన్ని  ప్రజలకు చూపించాలనుకున్నానని అందుకే  ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు వచ్చిన లాభాలను మొత్తం దీని మీద పెట్టినట్లు పేర్కొ్న్నారు. ఈ చిత్రానికి సరైన ఆదరణ రాకపోతే గతంలో లాగానే తన పరిస్థితి మారిపోతుందని ఆయన తెలిపారు. ఏ అంచనాలు లేకుండా వచ్చిన కశ్మీర్ ఫైల్స్ విజయం సాధించడంతో ఇప్పడు తీస్తున్న ది వ్యాక్సిన్ వార్ పై అంచనాలు పెరిగిపోయాయి.