NTV Telugu Site icon

Vitamin B12 : విటమిన్ బి12 లోపిస్తే ఇన్ని సమస్యలా..?

Vitamin 12

Vitamin 12

మన శరీరంలో నాడీవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి, ఎర్ర రక్తకణాల తయారీకి విటమిన్‌ బి12 (Vitamin B12) తప్పనిసరి. బి12 లోపం వల్ల మతిమరుపు, కండరాల బలహీనత, నీరసం, నిస్సత్తువ, ఒంట్లో వణుకు, మూత్రం ఆపుకోలేక పోవడం, రక్తహీనత సమస్యలు, మానసికంగా కుంగుబాటు వంటి సమస్యలు తలెత్తుతాయి. వయసు మీద పడే కొద్దీ మనం తీసుకునే ఆహారంలోని విటమిన్‌ బి12ను శరీరం గ్రహించే శక్తి తగ్గుతుంది. ఇదే బి12 లోపానికి ప్రధాన కారణం. అయితే విటమిన్‌ బి12 లోపానికి లక్షణాలు పైకి కనిపించవు. అందువల్లే విటమిన్‌ బి12 లోపాన్ని త్వరగా కనుక్కోలేం.
Also Read : Dragon Fruit : ఆ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే డ్రాగన్‌ ఫ్రూట్‌ తినండి..!

విటమిన్‌ బి12 లోపాన్ని తెలుసుకోవడానికి రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వైద్యుని సలహాతో సప్లిమెంట్స్‌ తీసుకోవడం వలన ఈ లోపాన్ని నివారించు కోవచ్చు. అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలను రోజువారి ఆహారంతో కలిపి తీసుకున్నా విటమిన్‌ బి12 లోపాన్ని అధిగమించవచ్చు. విటమిన్‌ బి12 పుష్కలంగా లభించే అతి చౌకైన ఆహారం గుడ్లు. గుడ్లలో విటమిన్‌ బి12 వల్ల పుష్కలంగా ఉంటుంది. ఎక్కువగా పచ్చ స్థానలో కొద్దిగా ఎగ్‌ వైట్‌లో ఉంటుంది. ప్రతి రోజు ఉడికించిన గుడ్డును క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా విటమిన్‌ బి12 లోపాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే సోయా ఉత్పత్తులు కూడా విటమిన్‌ బి12 అధికంగానే ఉంటుంది. ఒకవేళ మీరు శాఖాహారులు అయితే విటమిన్‌ బి12 పొందడానికి సోయా ఉత్పత్తులకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. సోయా పాలను క్రమం తప్పకుండా తీసుకున్నా మంచి ఫలితాలను పొందవచ్చు.
Also Read : Quick Pregnancy : ప్రెగ్నెన్సీ తొందరగా రావాలంటే ఏం చెయ్యాలి? ఏ టైం లో కలవాలి?

విటమిన్‌ బి12 సీ ఫుడ్స్‌లో అధికంగా లభిస్తుంది. చేపలు, రొయ్యలు, పీతలు వంటి సముద్ర ప్రాణుల్లో విటమిన్‌ బి12 అధికంగా లభిస్తుంది. ఒకవేళ మీరు నాన్‌ వేజిటేరియన్స్‌ అయితే సీఫుడ్స్‌ ఆహారంలో తరుచుగా తీసుకోవడం వల్ల బి12 లోపాన్ని తగ్గించుకోవచ్చు. విటమిన్‌ బి12 అధికంగా లభించే మరొక వనరు మాంసం. బీఫ్‌ మరియు చికెన్‌లో విటమిన్‌ బి12 అధికంగా ఉంటుంది. అలాగే చికెన్‌లో మిగతా వాటితో పోలిస్తే విటమిన్‌ బి12 ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బి12 లోపంతో బాధపడే వారికి చికెన్‌ ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. అలాగే పాల ఉత్పత్తుల ఐన పాలు, పెరుగు, చీజ్‌లలో కూడా విటమిన్‌ బి12 సమృద్ధిగా లభిస్తుంది. సుమారు పన్నెండు రకాల చీజ్‌లో విటమిన్‌ బి12 సమృద్ధిగా లభిస్తుంది. ఇది శాకాహారులకు మంచి ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. అలాగే క్యారెట్‌, బొప్పాయి, చిలకడదుంప వంటి వాటిలో కూడా విటమిన్‌ బి12 సమృద్ధిగా లభిస్తుంది.