Site icon NTV Telugu

Viswam: భలే మాస్ సాంగ్ పడిందే..!

Vishwam

Vishwam

మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల ఫస్ట్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటరీ మూవీ ‘విశ్వం’ దసరా కానుకగా అక్టోబర్ 11న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అయ్యింది. మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దోనేపూడి చక్రపాణి సమర్పిస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ సాంగ్స్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇక మేకర్స్ ఈ రోజు గుంగురు గుంగురు సాంగ్ ని రిలీజ్ చేశారు.

Read Also: Saddula Bathukamma: తెలంగాణలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు..

సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో మాస్ బీట్స్ తో పెర్ఫెక్ట్ ఫెస్టివల్ నెంబర్ గా కంపోజ్ చేసిన ఈ సాంగ్ అదిరిపోయింది అనే చెప్పాలి. ముఖ్యంగా సురేష్ గంగుల రాసిన మ్యాసీ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. భీమ్స్ సిసిరోలియో, ‘మాయిపిలో’ రోహిణి సోరట్ తమ ఎనర్జిటిక్ వోకల్స్ తో అదరగొట్టారు. ఈ సాంగ్ లో గోపీచంద్, కావ్యా థాపర్ మాస్ డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టారు. వైబ్రెంట్ సెట్స్ లో షూట్ చేసిన ఈ సాంగ్ లోని విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. థియేటర్స్ లో ఈ సాంగ్ పండగలా ఉండబోతోంది అని విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రానికి కెవి గుహన్ టాప్ క్లాస్ సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే రాశారు. ఎడిటర్‌ గా అమర్‌రెడ్డి కుడుముల, ఆర్ట్‌ డైరెక్టర్‌ కిరణ్‌ మన్నె పని చేస్తున్నారు.

Read Also: Newborn girl: బస్టాండ్ పబ్లిక్ టాయిలెట్‌లో నవజాత శిశువు..

Exit mobile version