టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా గామి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు విశ్వక్.. ఆ సినిమాలు అన్ని శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి.. ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఎప్పటినుంచో విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ఫిక్స్ చేశారు.. చైతన్య కృష్ణ దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచిది రెస్పాన్స్ ను అందుకుంది..
ఈరోజు విశ్వక్ బర్త్ డే సందర్బంగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.. ఈ సినిమాను మే 17 విడుదల చెయ్యనున్నారు.. విశ్వక్ పుట్టిన రోజు కానుకగా ఆయన మరో మూవీ నుంచి కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.. అలాగే విశ్వక్ సేన్ హీరోగా, రవితేజ ముల్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ మెకానిక్ రాకి ‘.. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమాలో విశ్వక్ మెకానిక్ గా కనిపించబోతున్నాడు.. ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.. మాస్ లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు విశ్వక్ సేన్..
ఆ పోస్టర్ లో చేతిలో రింజ్ పట్టుకొని, సిగరెట్ కాలుస్తూ దర్శనం ఇచ్చాడు విశ్వక్. ఈ మూవీలో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ సినిమా తన 10 వ సినిమాగా తెరకేక్కుతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. జేక్స్ బిజోయ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం..