Site icon NTV Telugu

Viswa Hindu parishad: విధ్వంసం వెనుక ఉగ్రవాద శక్తుల హస్తం!

Vhp Hyd

Vhp Hyd

అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై జరిగిన దాడి కలకలం రేపింది. ఈ విధ్వంసం వెనుక ఉగ్రవాద శక్తుల హస్తం ఉందని ఆరోపించింది విశ్వహిందూ పరిషత్. కోట్లాది రూపాయల రైల్వే ఆస్తుల విధ్వంసాన్ని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే GRP ( గవర్నమెంట్ రైల్వే పోలీసు ) మరియు రాష్ట్ర ఇంటలిజెన్స్ పూర్తిగా విఫలమైంది.

పలు రైళ్లు రద్దయి లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వందల సంఖ్యలో ఉన్న ఆందోళన కారులను అక్కడి నుండి తరలించడంలో స్థానిక పోలీసు యంత్రాంగం ఇంకా ఎందుకు కాలయాపన చేస్తుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు పరిశీలించి ఈ శుక్రవారం కూడా కొన్ని అసాంఘిక శక్తులు అల్లర్లు సృష్టించే ప్రమాదం ఉందని పోలీసులను ముందే హెచ్చరించినా తగిన చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు.

దేశ భక్తితో భారత సైన్యంలో చేరాలనుకునే యువత రైళ్ళుకు నిప్పు పెట్టారంటే నమ్మలేం. నిరుద్యోగ యువతను ముందుపెట్టుకాని తెరవెనుక అసాంఘిక శక్తులు తమ విద్రోహ ఎజెండా అమలు చేస్తున్నాయని వీహెచ్ పీ ఆరోపించింది. ముఖాలకు గుడ్డలు కట్టుకొని పోలీసులపై రాళ్ళ వర్షం కురిపిస్తూ రైల్వే ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన వీడియోలు చూస్తుంటే ఇది ఖచ్చితంగా సంఘ విద్రోహకర శక్తుల పనే అనే విషయం తెలుస్తుంది.

జరిగిన విధ్వంసం వెనకాల రాజకీయ పార్టీల కుట్రలపై కూడా పలు ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేయాలి. అగ్నిపథ్‌ విషయంలో అవాస్తవాలు అపోహలు సృష్టిస్తున్న శక్తులపై కూడా చట్టపరమైన చర్యలు చేపట్టాలి. నిరుద్యోగ యువత అనవసర పుకార్లు నమ్మి దేశ వ్యతిరేఖ శక్తుల కుట్రలకు బలికావద్దని విశ్వహిందూ పరిషత్ కోరింది.

Raghunandan Rao : నిఘా వ్యవస్థ తెలంగాణలో నిద్ర పోతుంది

Exit mobile version