NTV Telugu Site icon

Gangs of Godavari: విశ్వక్ సేన్ తదుపరి చిత్రానికి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టైటిల్ ఖరారు

Vishwaksenactor

Vishwaksenactor

Gangs of Godavari: ఈ ఏడాది దాస్ కా ధమ్కీ చిత్రంతో విశ్వక్ సేన్ తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఆ జోష్ లో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ‘VS11’తో మొదలైన సినిమాకు నేడు గ్యాంగ్స్ ఆఫ్ గోదారి టైటిల్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమాకు కృష్ణ చైతన్య రచన, దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ క్రూరమైన ప్రపంచంలో సామాన్యుడి నుంచి ధనవంతుడిగా ఎదిగిన వ్యక్తి పాత్రలో విశ్వక్ సేన్ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర సూపర్ గా ఉంటుందని.. విశ్వక్ తన నటనతో ఈ సారి విమర్శకుల ప్రశంసలు అందుకోవడం గ్యారంటీ అంటున్నారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ కొడుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో చిత్ర బృందం చెబుతోంది.

Read Also:CM Jagan : రేపు సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖపట్నం పర్యటన

ఇంకా ఈ సినిమాలో తెలుగమ్మాయి అంజలి ‘రత్నమాల’ అనే పాత్రలో నటిస్తుంది. ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల నేపథ్యంలో జరిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. టైటిల్‌తో పాటు, ఈ మూవీ గ్లింప్స్ ని కూడా విడుదల చేసింది చిత్రయూనిట్… ” అన్నాయ్.. మేము గోదారోళ్లం.. మాట ఒకటే సాగదీస్తాం.. తేడాలొస్తే నవ్వుతూనే నరాలు లాగేస్తామంటూ విశ్వక్ చెప్పిన డైలగ్ అదిరిపోయింది. విశ్వక్ సేన్ లుంగీతో ఊర మాస్ గెటప్ లో కనిపిస్తున్నారు. అక్రమంగా రాత్రుళ్లు సరుకు లారీల్లో తరలించడం, గోదారి పరిసరాల్లో హైలెట్ గా నిలిచే యాక్షన్ సీక్వెన్స్ తో ఆసక్తికరంగా సాగిన గ్లింప్స్ బాగుంది. దాంతో పాటు నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో విశ్వక్ సరసన నేహా శెట్టి నటిస్తోంది. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా 2023 డిసెంబర్ లో విడుదల కానుంది.

Read Also:CPI Ramakrishna : సీఎం జగన్‌కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ