NTV Telugu Site icon

Gaami Trailer: సరికొత్త ఫార్మాట్‌లో విశ్వక్‌ సేన్‌ ‘గామి’ ట్రైలర్.. ఇదే మొట్టమొదటిసారి!

Gaami Trailer

Gaami Trailer

Vishwak Sen’s Gaami Trailer to Be Released In PCX Format: మాస్ క దాస్ విష్వక్‌ సేన్‌ హీరోగా, విద్యాధర్‌ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గామి’. వి సెల్యులాయిడ్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ ఈ చిత్రంను నిర్మించారు. శంకర్‌ అనే అఘోరా పాత్రలో విష్వక్‌ సేన్‌ కనిపించనున్నాడు. అఘోరా గెటప్‌తో పాటు మరో రెండు భిన్నమైన గెటప్‌లు కూడా ఇందులో ఉంటాయి. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చూడని సరికొత్త కథతో వస్తున్న గామి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన గామి ఫస్ట్ లుక్, టీజర్ ఆ అంచనాలు రెట్టింపు చేశాయి.

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గామి ట్రైలర్ త్వరలోనే రాబోతోంది. ఫిబ్రవరి 29న ట్రైలర్ లాంచ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే సరికొత్త ఫార్మాట్‌లో ట్రైలర్ రిలీజ్ అవుతోంది. గామి షోరీల్ ట్రైలర్ పీసీఎక్స్ ఫార్మాట్‌లో విడుదల అవుతోందని చిత్ర యూనిట్ పేర్కొంది. ప్రసాద్స్‌లోని పీసీఎక్స్ స్క్రీన్‌లో ఫిబ్రవరి 29న సాయంత్రం 4 గంటలకు ట్రైలర్‌ను లాంచ్ చేస్తున్నామని ప్రకటించారు. పీసీఎక్స్ ఫార్మాట్‌లో ఆవిష్కరించబడిన మొట్టమొదటి ట్రైలర్ ఇదే కావడం విశేషం.

Also Read: Operation Valentine: నైజాం థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్న మైత్రీ మూవీస్!

మానవ స్పర్శకు దూరంగా ఉండే ఒక వ్యక్తి అఘోరాగా ఎలా మారాడు, లోతైన సత్యం కోసం అతని అన్వేషణ ఎక్కడివరకు సాగింది అనే పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కోసం విష్వక్‌ సేన్‌ చాలా కాలంగా కష్టపడుతున్నారు. కంటెంట్‌పై ఉన్న నమ్మకమే ఇందుకు కారణం. మరి సరికొత్త కథా, కథనాలతో వస్తున్న గామి సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Show comments