NTV Telugu Site icon

Vishwak Sen: పాపులర్ సింగర్ ను ‘వాడు’ అనేసి నాలుక కరుచుకున్న విశ్వక్

Vishwaksen

Vishwaksen

చేసింది కొన్ని సినిమాలు అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్సేన్. తెలుగులో ఫలక్నామా దాస్, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో హీరోగా ఎస్టాబ్లిష్ అయిన ఆయన ఇప్పుడు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. చివరిగా చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోగా ఇప్పుడు ఆయన మెకానిక్ రాఖీ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా నవంబర్ 22వ తేదీ అంటే రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది, అయితే ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ కూడా ప్రదర్శించింది సినిమా యూనిట్.

President Droupadi Murmu: తొలిసారి కోటి దీపోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్సేన్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఒక పాపులర్ సింగర్ ని వాడు అంటూ సంభోదించాడు వెంటనే తప్పు తెలుసుకుని ఆ ట్వీట్ డిలీట్ చేసి తన టీం నుంచి తప్పుగా ఈ ట్వీట్ వచ్చిందని క్షమించాలని కోరాడు. అసలు విషయం ఏమిటంటే అర్జిత్ సింగ్ చేత తెలుగులో పాట ఇప్పుడు పాడిస్తున్నారు విశ్వక్ అన్న అని అంటూ ఒక అభిమాని కామెంట్ చేశారు. దానికి వాడు పాడినప్పుడు అంటూ విశ్వక్ ఎకౌంట్ నుంచి రిప్లై వచ్చింది. ఈ విషయం మీద పెద్ద ఎత్తున దుమారం రేగడంతో వెంటనే తప్పు తెలుసుకున్న విశ్వక్సేన్ ఇది తన టీం తరఫున జరిగిన తప్పు అని ఆ రిప్లై డిలీట్ చేశామని సిన్సియర్గా క్షమాపణలు కోరుతున్నానని అంటూ చెప్పుకొచ్చాడు.

Show comments