Vishwak Sen : విశ్వక్ సేన్ కు కలిసి రాని వాలెంటైన్స్ డే.. ఏమైందంటే

Vishwak Sen

Vishwak Sen

మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్నాడు. ప్రతిసారి హిట్ కొత్తతాడు అనే రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే, గడిచిన రెండేళ్లుగా వాలెంటైన్స్ డే  సీజన్ మాత్రం అతనికి అస్సలు కలిసి రావడం లేదు. 2025లో ‘లైలా’తో ఎదురైన చేదు అనుభవం, 2026లో ‘ఫంకీ’తోనూ సేమ్ రిజల్ట్ అందుకోవడం ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Also Read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమాకు బ్రేక్

×
×
Ad

గతేడాది ఫిబ్రవరి 14న విడుదలైన ‘లైలా చిత్రంపై విశ్వక్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాలో ఆయన లేడీ గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విభిన్నమైన ప్రమోషన్స్, భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. కథలో బలం లేకపోవడం మరియు కొన్ని వివాదాల కారణంగా ‘లైలా’ విశ్వక్ కెరీర్‌లో ఒక డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ‘లైలా’ పరాజయం తర్వాత, ఈ ఏడాది  వాలెంటైన్స్ డే కానుకగా విడుదలైన ‘ఫంకీ’ చిత్రంతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇస్తాడని అభిమానులు ఆశించారు. ‘జాతిరత్నాలు’ ఫేమ్ కె.వి. అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉండేది. కానీ,  ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. మిశ్రమ స్పందన రావడంతో వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా వాలెంటైన్స్ డే సెంటిమెంట్ విశ్వక్ సేన్ కు కలిసి రాలేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.