Site icon NTV Telugu

Gaami : విశ్వక్ సేన్ గామి ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..?

Whatsapp Image 2024 02 27 At 4.27.41 Pm

Whatsapp Image 2024 02 27 At 4.27.41 Pm

విశ్వక్‌సేన్ నటించిన గామి మూవీ మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. థియేట్రికల్ రిలీజ్‌కు రెండు వారాల ముందే గామి సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.విశ్వక్‌సేన్‌కు యూత్ లో మంచి క్రేజ్‌ ఉండటంతో పాటు గామి కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో ఫ్యాన్సీ రేటుకు ఓటీటీ హక్కులను జీ5 కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకున్నట్లు సమాచారం.. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత గామి మూవీ ఓటీటీలో రిలీజయ్యేలా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో దర్శకనిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.గామి సినిమాలో అఘోరాగా విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ఈ సినిమాతో విద్యాధర్ కాగిత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.. తొలుత ఫిబ్రవరి 29న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్‌చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో మార్చి 8కి రిలీజ్ డేట్‌ను వాయిదావేశారు.

ఇటీవల రిలీజైన గామి టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది.. శంకర్ అనే యువకుడు అస్సలు అఘోరాగా ఎందుకు మారాడు.. హిమాలయాల వరకు సాగిన అతడి ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అన్నదే ఈ మూవీ కథ. 2017లో గామి సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. 2018 లో షూటింగ్ మొదలైంది. దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్‌ను జరుపుకున్నది. గామి సినిమాను యూవీ క్రియేషన్స్ అనుబంధం సంస్థ వీ సెల్యూలాయిడ్స్ రిలీజ్ చేస్తోంది. గామి సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. అభినయ, సమద్‌ మరియు హారిక ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.మార్చి 8 వ తేదీన విశ్వక్ సేన్ గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకోకుండా ఈ మూవీ పోస్ట్ పోన్ కావడంతో అదే డేట్‌కు గామి థియేటర్లలోకి వస్తోంది. గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీకి చైతన్య కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.గోదావరి జిల్లాల బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ యాక్షన్ డ్రామాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ తెరకెక్కుతోంది.ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే హీరోయిన్ అంజలి మరో కీలక పాత్ర పోషిస్తోంది

Exit mobile version