Gaami : విశ్వక్ సేన్ గామి ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వక్‌సేన్ నటించిన గామి మూవీ మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. థియేట్రికల్ రిలీజ్‌కు రెండు వారాల ముందే గామి సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.విశ్వక్‌సేన్‌కు యూత్ లో మంచి క్రేజ్ ఉండటంతో పాటు గామి కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో ఫ్యాన్సీ రేటుకు ఓటీటీ హక్కులను జీ5 కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకున్నట్లు సమాచారం.. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత గామి మూవీ ఓటీటీలో రిలీజయ్యేలా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో దర్శకనిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది.గామి సినిమాలో అఘోరాగా విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ఈ సినిమాతో విద్యాధర్ కాగిత దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.. తొలుత ఫిబ్రవరి 29న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్‌చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో మార్చి 8కి రిలీజ్ డేట్‌ను వాయిదావేశారు.
ఇటీవల రిలీజైన గామి టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది.. శంకర్ అనే యువకుడు అస్సలు అఘోరాగా ఎందుకు మారాడు.. హిమాలయాల వరకు సాగిన అతడి ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అన్నదే ఈ మూవీ కథ. 2017లో గామి సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. 2018 లో షూటింగ్ మొదలైంది. దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్‌ను జరుపుకున్నది. గామి సినిమాను యూవీ క్రియేషన్స్ అనుబంధం సంస్థ వీ సెల్యూలాయిడ్స్ రిలీజ్ చేస్తోంది. గామి సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. అభినయ, సమద్ మరియు హారిక ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.మార్చి 8 వ తేదీన విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుకోకుండా ఈ మూవీ పోస్ట్ పోన్ కావడంతో అదే డేట్‌కు గామి థియేటర్లలోకి వస్తోంది. గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీకి చైతన్య కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.గోదావరి జిల్లాల బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ యాక్షన్ డ్రామాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ తెరకెక్కుతోంది.ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే హీరోయిన్ అంజలి మరో కీలక పాత్ర పోషిస్తోంది
Also Read
- Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
- Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
తాజావార్తలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
-
Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
-
Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
-
PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
-
Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!