Vishwak Sen: అకౌంట్‌లో అడ్వాన్స్ చూసి ఎమోషనల్ అయ్యా..

Vishvak Sen

Vishvak Sen

టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నటుడు విశ్వక్ సేన్. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నారు. అయితే ఈ స్థాయికి చేరడానికి ఆయన దాటి వచ్చిన కష్టాలు, తన అకౌంట్‌లో మొదటిసారి లక్ష రూపాయలు చూసినప్పుడు కలిగిన ఆనందం గురించి తాజాగా ఒక చిట్‌చాట్‌లో పంచుకున్నారు.

Also Read :Mrunal Thakur : దాని కోసం దర్శకుల వెంటపడక తప్పడంలేదు: మృణాల్ ఠాకూర్

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ‘మా నాన్న మొదట కరాటే నేర్పించేవారు. దానివల్ల ఆదాయం సరిపోక కన్స్ట్రక్షన్ ఫీల్డ్‌లోకి వెళ్లారు. నేను పుట్టినప్పుడు మాకు సొంత ఇల్లు కూడా లేదు. పెద్ద చదువులు చదవాలంటే డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయని డిగ్రీలో చేరాను. ఒకప్పుడు నా బ్యాంక్ ఖాతాలో రూ. లక్ష ఉంటే చాలు అనుకునేవాడిని. ‘ఫలక్‌నుమా దాస్’ సినిమా విడుదలయ్యాక మొదటిసారి నా అకౌంట్‌లో అంత డబ్బు చూశాను. అంతకు రెండు రోజుల ముందే ‘హిట్’ సినిమా అడ్వాన్స్ రూపంలో రూ. 50 వేలు పడితే అది చూసి చాలా మురిసిపోయాను’ అని గుర్తుచేసుకున్నారు.

ఇండస్ట్రీలో తనపై వచ్చే విమర్శల గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను. సినిమాల కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేను. అలా ఉంటే ఇండస్ట్రీలో రాణించలేవు అని చాలామంది నన్ను భయపెట్టారు. కానీ మనిషికి క్యారెక్టర్ ముఖ్యం. సినిమా హిట్ అయితే హీరో ఎవరని చూడకుండా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు, అదే కథ బాలేకపోతే మనవాడే కదా అని ఎవరూ హిట్ చేయరు. అందుకే నా సినిమాలే నా గురించి మాట్లాడతాయని నేను నమ్ముతాను’ అని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం విశ్వక్ నటించిన ‘ఫంకీ’ (Funky) సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.