Site icon NTV Telugu

Vishva Hindu Parishad: క్షమాపణలు చెప్పకపోతే.. కచ్చితంగా రాజమౌళి సినిమాలు ఆపేస్తాం!

Vishva Hindu Parishad

Vishva Hindu Parishad

హనుమంతుడుపై టాలీవుడ్ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పకపోతే.. కచ్చితంగా ఆయన సినిమాలు ఆపేస్తాం అంటూ విశ్వహిందూ పరిషత్ హెచ్చరించింది. తండ్రి మనోభావాలను సైతం కించపరుస్తూ మాట్లాడారని విశ్వహిందూ పరిషత్ తెలుగు రాష్ట్రాల క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు దేవుళ్లుగా కనిపించలేదా? అని ప్రశ్నించారు. హిందూ సమాజం చూస్తూ ఊరుకోదని రాజమౌళిని రవికుమార్ హెచ్చరించారు. రాజమౌళి వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని తీవ్ర వేదనకు గురిచేశాయని పేర్కొన్నారు.

Also Read: Yamini Sharma-Rajamouli: రాజమౌళి గారూ దేవుడు కమర్షియల్ కాదు‌.. యామిని శర్మ ఆగ్రహం!

‘ప్రముఖ దర్శకుడు రాజమౌళి గారు హిందూ సమాజం ముందు గల్లీ స్థాయి వ్యక్తిగా దిగజారిపోయారు. హనుమంతుడికి, మీ క్లిప్స్ రిలీజ్ అవకపోవడానికి సంబంధం ఏంటి?. కృష్ణుడు నీ దృష్టిలో జగద్గురువు కాదు. రాముడు, కృష్ణుడి, హనుమంతుడిపై మీరు చేసిన విమర్శలను విశ్వహిందూపరిషత్ ఖండిస్తుంది. మీ వ్యాఖ్యలను ధర్మ‌ ద్రోహంగా భావిస్తాం. అంజనేయ స్వామిని నిందించడం మీకు ఫ్యాషన్‌గా మారింది. మదం, గర్వంతో మాట్లాడిన ప్రేలాపనలుగా భావిస్తాం.మీ తండ్రిని కూడా బాధించేలా మాట్లాడావు. మీ ప్రచారాలకు, మీ క్లిప్స్ కి హనుమంతుడికి సంబంధం ఏమిటి. కాసుల గర్వంతో మాట్లాడితే విశ్వహిందూ పరిషత్ క్షమించదు. బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పు. దైవాన్ని అపహాస్యం చేసేలా‌ మీ సినిమాల్లో ఉంటే.. విశ్వహిందూ పరిషత్ ఆ సినిమాలు ఆపేస్తుంది’ అని సత్య రవికుమార్ వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version