విష్ణుప్రియ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ అంతగా ఫేమ్ కాలేకపోయింది. ఆ తరువాత బుల్లితెర యాంకర్ గా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంది.పోవే పోరా షోతో విష్ణుప్రియ యాంకర్ గా మారింది.. సుడిగాలి సుధీర్ తో పాటు పోవే పోరా వంటి యూత్ ఫుల్ షోకి యాంకరింగ్ చేసింది. ఆ షో తో విష్ణుప్రియ బుల్లితెర యాంకర్ గా ఫేమస్ అయ్యింది.ఆ క్రేజ్ సోషల్ మీడియాలో కూడా ఉపయోగించుకుంది.. బోల్డ్ ఫోటో షూట్స్ తో మరింత క్రేజ్ ను రాబట్టింది.లో దుస్తుల్లో తన బోల్డ్ లుక్ చూసి నెటిజన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆమె కు వున్న క్రేజ్ కి సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అనసూయ, సునీల్, వెన్నెల కిషోర్, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రలు చేశారు. అయితే వాంటెడ్ పండుగాడ్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఇటీవల విష్ణు ప్రియా దయ అనే వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్ర చేసింది. ఈ సిరీస్ లో లేడీ జర్నలిస్ట్ పాత్రలో ఆకట్టుకుంది. దయ వెబ్ సిరీస్ లో జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా కీలక పాత్రలలో నటించారు. ఈ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దయ సిరీస్ కి కొనసాగింపు కూడా ఉందని సమాచారం.ఈ మధ్య బుల్లితెర మీద విష్ణుప్రియ సందడి అయితే తగ్గింది. ఆమె నటిగా బిజీగా కావాలని అనుకుంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తుంది. డిజిటల్ సిరీస్ లో బోల్డ్ కంటెంట్ ఇవ్వడానికి కూడా ఆమె సిద్ధంగా ఉంది.విష్ణుప్రియా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. ఇటీవల తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఆమె ఫేస్ బుక్ పేజ్ లో అశ్లీల ఫోటోలు, వీడియోలు దర్శనం ఇచ్చాయి. నా అకౌంట్ హ్యాక్ అయ్యిందని విష్ణుప్రియ వివరణ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో విష్ణుప్రియ నిత్యం తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తుంది. తాజాగా ట్రెడిషనల్ కనిపించి ఆకట్టుకుంది. అయితే ట్రెడిషనల్ వేర్ లో కూడా క్లివేజ్ అందాలు చూపిస్తూ రెచ్చ గొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి..