యాంకర్ విష్ణు ప్రియ అంటే తెలియని వారుండరు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ‘పోవే పోరా’ గేమ్ షో తో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్‌లోకి కూడా వెళ్లి వచ్చాక మరింత ఫేమ్ సంపాదించుకుంది. అయితే తాజాగా ఓ షోలో పాల్గొన్న విష్ణు ప్రియ తన పర్సనల్ లైఫ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. బ్రేకప్ గురించి మాట్లాడుతూ, నచ్చిన వ్యక్తి పెళ్ళికి ఒప్పుకోకపోతే సన్యాసం తీసుకోవడానికి కూడా సిద్ధమే అని చెప్పింది. అలాగే, మార్ఫింగ్ వీడియోల వల్ల పడిన అవమానాలు తనను ఎంతగా కుంగదీశాయంటే, ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య ఆలోచన కూడా వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే, ఈ ఇంటర్వ్యూలో అసలు విషయం ఏమిటంటే, జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ఆమె చేసిన కామెంట్స్.
Also Read : Thalapathy Vijay : ప్రజల కోసమే ఈ నిర్ణయం.. దళపతి విజయ్ తండ్రి వైరల్ కామెంట్
వేణు స్వామి గురించి బయట ఎన్ని విమర్శలు ఉన్నా, ఆయన తనకు చేసిన సహాయం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిదని విష్ణు ప్రియ ఎమోషనల్ అయ్యారు. తన తల్లి చనిపోయే సమయంలో హాస్పిటల్ బిల్లులు లక్షల్లో పెరిగిపోయాయని, అప్పుడు ఎవరికీ అడగకూడదనుకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో వేణు స్వామికి ఫోన్ చేశానని తెలిపారు. వెంటనే ఆయన డబ్బులు అరేంజ్ చేసి ఇచ్చారు, ఆయన చేసిన సహాయం వల్లే డాక్టర్లు మూడు రోజులే బ్రతుకుతారన్న తన తల్లి మరో ఏడాది పాటు బతికిందని ఆమె అన్నారు. ఆయన గురించి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతారు. కానీ నిజంగా ఆయన గురించి తెలిసిన వాళ్ళు తప్పుగా మాట్లాడరు. ఎవరికైనా అవసరం వస్తే ముందుగా వచ్చి సహాయం చేసే మంచి మనిషి వేణు స్వామి, అంటూ విష్ణు ప్రియ ప్రశంసలు కురిపించారు.
