NTV Telugu Site icon

Vishal: తాగుబోతుని కొట్టిన విశాల్.. రత్నం షూటింగ్ లో షాకింగ్ సంఘటన

Vishal Beating

Vishal Beating

Vishal beaten drunken man who is asking alcohol: నటుడు విశాల్ గత చిత్రం మార్క్ ఆంటోని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. నటుడు విశాల్ కెరీర్‌లో రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి సినిమాగా మార్క్ ఆంటోనీ రికార్డు సృష్టించింది. ఇక మార్క్ ఆంటోని సక్సెస్ తర్వాత విశాల్ ప్రస్తుతం రత్నం అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరు కలిసి చేసిన తామిరభరణి(తెలుగులో భరణి), పూజై(తెలుగులో పూజ) సినిమాలు హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు రత్నం సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు వీరిద్దరూ జతకట్టారు. రత్నం సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇదిలా ఉంటే రత్నం సినిమా సెట్స్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

Bhamakalapam 2 :ఆకట్టుకుంటున్న ప్రియమణి భామాకలాపం 2 గ్లింప్స్..

రత్నం కోసం టాస్మాక్ షాప్(మందుబాబుల కోసం తమిళనాడు ప్రభుత్వం నడిపే లిక్కర్ షాప్) లాంటి సెట్ వేశారు. ఇది నిజమైన టాస్మాక్‌ అని భావించి క్యూల వద్ద మద్యం కొనుగోలు చేసేందుకు అక్కడి వారు బారులు తీరుతున్నారు. ఇది చూసిన నటుడు విశాల్.. మద్యం కొనుక్కోవడానికి అక్కడే నిలబడిన వారిని వెళ్లిపొమ్మని కోరారు. అయితే ఓ తాగుబోతు ఇంతకీ వినకపోవడంతో అతన్ని పట్టుకుని, ఇది రత్నం సినిమా కోసం ఏర్పాటు చేశానని చెప్పి కొట్టాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ విడుదలై వైరల్ అవుతోంది. అయితే ఇది నిజమా లేక సినిమా షూట్ లో భాగమా అనేది కూడా తెలియాల్సి ఉంది.