Site icon NTV Telugu

Visakhapatnam: విశాఖపట్టణం గూఢచర్య కేసులో ఇద్దరు నిందితులకు శిక్షలు.. NIA ప్రత్యేక కోర్టు తీర్పు

Srinivas Arrest

Srinivas Arrest

Visakhapatnam: పాకిస్థాన్ అనుబంధంగా ఉన్న విశాఖపట్టణ నేవీ గూఢచర్య కేసులో మరో ఇద్దరు నిందితులకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక కోర్టు శిక్షలను విధించింది. సింపుల్ ఇంప్రిజన్ (SI)తో పాటు జరిమానా కూడా విధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో రాజస్థాన్‌లోని ఝున్‌ఝునూ జిల్లాకు చెందిన అశోక్ కుమార్, అల్వార్ జిల్లాకు చెందిన వికాస్ కుమార్‌లకు UA(P) చట్టం సెక్షన్ 18, అధికార రహస్యాల చట్టం (Official Secrets Act) సెక్షన్ 3 కింద ప్రతి సెక్షన్‌కు 5 సంవత్సరాలు 11 నెలలు జైలు శిక్ష విధించారు. అలాగే కోర్టు విధించిన రూ.5,000 జరిమానా చెల్లించకపోతే మరొక సంవత్సరం SI అనుభవించాల్సి ఉంటుంది. ఈ తీర్పును విశాఖపట్టణంలోని NIA ప్రత్యేక కోర్టు ప్రకటించింది.

GHMC : జీహెచ్ఎంసీలో కలువనున్న 27 మున్సిపాలిటీలు ఇవే..

ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన 15 మంది నిందితులలో 8 మందికి శిక్షలు ఖరారయ్యాయి. అశోక్, వికాస్‌లను 2019 డిసెంబర్‌లో మహారాష్ట్రలోని ముంబయి, కర్ణాటకలోని కార్వార్ ప్రాంతాల నుంచి అరెస్టు చేశారు. 2020 జూన్‌లో NIA మొత్తం 14 మందిపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అనంతరం 2021 మార్చిలో మరో నిందితుడిపై అనుబంధ చార్జ్‌షీట్ సమర్పించింది. విశాఖ నేవీ కీలక కేంద్రాలు, దేశ భద్రతకు సంబంధించిన కీలక సంస్థలపై పాకిస్థాన్ తరఫు గూఢచర్యం జరిపిన కేసు నేపథ్యంలో ఈ దర్యాప్తు సాగుతోంది. ఈ కేసును మొదట విచారించిన విజయవాడ ఇంటెలిజెన్స్‌ విభాగంలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీస్‌స్టేషన్ నుంచి NIA 2019 డిసెంబర్‌లో స్వీకరించింది. దేశ ఏకత్వం, సమగ్రత, భద్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా జరిగిన ఈ గూఢచర్య కుట్ర మొత్తాన్ని బయటపెట్టేందుకు NIA దర్యాప్తు వేగంగా కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.

Gold Purity: హాల్‌మార్క్, KDM, 916 గోల్డ్ అంటే ఏమిటి? బంగారం కొనుగోలు చేసే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వివరాలు ఇవే..!

Exit mobile version