NTV Telugu Site icon

Vizag Danger Climate : హీట్ ఐలాండ్ ను తలపిస్తున్న విశాఖ

Vsp Weather

Vsp Weather

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఈ క్రమంలో ఏపీ వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం, మంగళవారం ఏపీలోని పలు మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని.. ప్రజలను హెచ్చరించింది. ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది.

Read Also : Ladakh shut down: లడఖ్ లో సంపూర్ణ బంద్.. దలైలామాకు సంఘీభావంగా నిరసన..

అయితే విశాఖ నగరంపై ఉప్పు మేఘం కమ్మేసింది. కోస్టల్ బ్యాటరీ నుంచి వైఎంసీఏ వరకు దట్టమైన తేమ గాలులు అల్లుముకున్నాయి. ఎటు చూసినా ఇదే వాతావరణం కనిపిస్తోంది. దీనికి సముద్ర ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడమే కారణం అంటున్నారు నిపుణులు. ఏటా మే నెల మధ్యలో ఇటువంటి వాతావరణం వుంటుంది. అయితే, ఉత్తరాంధ్రలో ప్రస్తుతం అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. విశాఖ నగరం పగలంతా హీట్ ఐలాండ్ ను తలపిస్తోంది. ఉదయం, సాయంత్ర దట్టమైన తేమగాలులు వీస్తున్నాయి. ఇది అసాధారణమైన పరిణామం కాకపోయినప్పటికీ సమ్మర్ తీవ్రత ఎంత స్థాయిలో పెరిగిందో గుర్తించవచ్చంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ ఏడాది ఎలినినో కండిషన్స్ వస్తాయనే అంచనాలకు తగ్గట్టుగానే తీవ్ర ఎండలు, ఉక్కపోతలు ఇబ్బంది కరంగా మారాయి.

Read Also : Kishan Reddy : కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి

దీంతో విశాఖ వాసులు అధికంగా నమోదవుతున్న ఎండలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 11 దాటితే ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అవసరమయితేనే బయటకు వస్తున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు.. పగలు ఎండలు, రాత్రి తేమగాలులతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణ శాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది.

Show comments