Site icon NTV Telugu

New Year 2026-Vizag: న్యూ ఇయర్ వేడుకలకు సిద్దమైన విశాఖ.. ఈసారి డబుల్ టార్గెట్!

New Year 2026 Vizag

New Year 2026 Vizag

న్యూ ఇయర్ వేడుకలకు విశాఖ నగరం సిద్ధమవుతుంది. న్యూ ఇయర్ సందర్భంగా కొత్త జోష్ అందివ్వడానికి ఈవెంట్ ఆర్గనైజర్లు నెలరోజుల ముందు నుండే సిద్దమయ్యారు. నయా సాల్ సందర్బంగా మద్యం విక్రయాలు కోసం డిపోలకు క్యూలు కడుతున్నారు ఆర్గనైజర్లు. మరో వైపు గైడ్ లైన్స్ జారీ చేసింది ఎక్సైజ్ శాఖ. విదేశీ మద్యం, కల్తీ మద్యంపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఓపెన్ ప్లేస్లలో నిర్వహించే ఈవెంట్లకు ఎట్టి పరిస్థితుల్లో మద్యం విక్రయాలు నిర్వహించడానికి అనుమతులు ఉండవని స్పష్టం చేశారు.

Also Read: Mohanlal Mother Dead: మోహన్‌లాల్‌కి మాతృవియోగం!

రిటైల్ మద్యం స్టోర్లకు అర్ధరాత్రి 12 వరకు.. ప్లబ్బులు, క్లబ్బులకు అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతులు ఇస్తున్నామని ఎక్సైజ్ శాఖ తెలిపింది. గత ఏడాది డిసెంబర్ 31, జనవరి 1వ తేదీలలో సుమారు రూ.12 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరగ్గా.. ఈ ఏడాది రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్నారు ఎక్సైజ్ సూపరండెంట్ ఆర్ ప్రసాద్. ఇప్పటివరకు 14 అప్లికేషన్లు న్యూ ఇయర్ ఇవెంట్స్ నిర్వహణ కోసం వచ్చాయన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ నెలలో రోజుకు సగటు రూ.5 నుంచి రూ.6 కోట్ల చొప్పున రూ.146 కోట్లు విక్రయాలు జరిగాయన్నారు. పోలీస్ శాఖ ఇచ్చిన గైడ్లైన్స్ ఎవరైనా మితిమీరిన, పాటించకపోయినా.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని ఎక్సైజ్ సూపరిండెంట్ ఆర్ ప్రసాద్ హెచ్చరించారు.

Exit mobile version