NTV Telugu Site icon

YCP-Visakha Dairy: వైసీపీకి విశాఖ డెయిరీ ఛైర్మన్‌ రాజీనామా!

Adari Anand Kumar

Adari Anand Kumar

వైసీపీకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ రాజీనామా చేశారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి ఆనంద్ రాజీనామా చేశారు. ఆనంద్‌తో పాటు 12 మంది డైయిరీ డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఆనంద్‌ తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ఆనంద్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీ పార్టీ కార్యకలాపాలకు ఆడారి ఆనంద్ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు.

వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన వారిలో విశాఖ డెయిరీ డైరెక్టర్లు శరగడం వరాహ వెంకట శంకర్రావు, కోళ్ల కాటమయ్య, పిల్లా రమా కుమారి, శీరంరెడ్డి సూర్యనారాయణ, ఆరంగి రమణబాబు, చిటికెల రాజకుమారి, దాడి పవన్ కుమార్, రెడ్డి రామకృష్ణ, పరదేశి గంగాధర్, సుందరపు ఈశ్వర్ ఉన్నారు. అందరూ వైసీపీ కేంద్ర కార్యాలయానికి తమ రాజీనామా లేఖలను పంపించారు. రాజీనామా లేఖలు ఇంకా అధికారికంగా వైసీపీకి చేరలేదని సమాచారం.